పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా? ఈ జాగ్రత్తలు నేర్పండి..!
నేటి ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. దీనివల్ల ఎప్పుడు ఏ పని ఉంటుందో తెలియని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులిద్దరూ పిల్లలను వదిలి బయటకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు పిల్లలు పలు రకాల సమస్యలు......
నేటి ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. దీనివల్ల ఎప్పుడు ఏ పని ఉంటుందో తెలియని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులిద్దరూ పిల్లలను వదిలి బయటకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు పిల్లలు పలు రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి, పిల్లలకు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వారికి కొన్ని అంశాలపై అవగాహన కల్పించాలంటున్నారు. అవేంటో తెలుసుకుందామా...
అందులో పోస్ట్ చేయద్దు..
కొంతమంది తాము చేసే ప్రతి పనిని ఇతరులకు తెలియజేయాలనే ఆత్రుతతో సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంటారు. ఒక్కోసారి ఇవే ప్రమాదకరంగా మారుతుంటాయి. ఇదే విషయాన్ని మీ పిల్లలకు తెలియజేయండి. మీరు మీ పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లినప్పుడు వారు ఒంటరిగా ఉన్నారని తెలియజేసే విధంగా ఎలాంటి పోస్టులు పెట్టద్దని చెప్పండి. ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల కలిగే ప్రమాదాన్ని ఉదాహరణ రూపంలో వివరించండి.
వారొస్తే డోర్ తీయద్దు...
సాధారణంగా పిల్లలను అపరిచితులకు దూరంగా ఉంచుతుంటాం. అలాగే వారు ఏది ఇచ్చినా తీసుకోవద్దని చెబుతుంటాం. ఇదే పద్ధతిని మీరు ఇంట్లో లేని సమయంలోనూ పాటించమని చెప్పాలి. అలాంటి వారెవరైనా వస్తే డోర్ తీయద్దని చెప్పాలి. దీనికోసం మీ ఇంటి చుట్టూ సెక్యూరిటీ కెమెరాలను పెట్టండి. ఇలా చేయడం వల్ల ఎవరు డోర్ బెల్ కొట్టారో వారు సులభంగా తెలుసుకోవచ్చు.
ఆ ప్రయోగాలు వద్దు...
కొంతమంది పిల్లలు అమ్మా నాన్న లేరు కదా! అని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. వంట చేయడం ఇందులో భాగమే. ఇది అస్సలు మంచిది కాదు. మీరు బయటకు వెళ్లినప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి వెళ్లండి. అలాగే పిల్లలను ఇలాంటి మంట వచ్చే వస్తువులకు దూరంగా ఉండమని చెప్పండి. దానివల్ల వచ్చే అనర్థాలను వారికి వివరించండి.
అత్యవసర నంబర్లు చెప్పండి..
ఈ రోజుల్లో చిన్న పిల్లలు సైతం మొబైల్‌ని ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నష్టాలతో పాటు లాభాలు కూడా ఉన్నాయి. వారికి ఏదైనా అత్యవసరం అయినప్పుడు మొబైల్ ఫోన్ ఎంతో ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఎవరికి ఫోన్ చేయాలో ముందుగానే చెప్పండి. మీ సన్నిహితులు, ఇంటి పక్కన ఉన్నవారి నంబర్లను వారికి చెప్పండి. మర్చిపోకుండా ఉండడానికి ఆ నంబర్లను నోట్‌బుక్‌లో రాయించండి.
ఇవి కూడా...
* ఎమర్జెన్సీ లైట్లకు ఎప్పుడూ ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలి. దానిని ఎలా ఉపయోగించాలో పిల్లలకు చెప్పండి. ఎప్పుడైనా కరెంట్ లేనప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది.
* కొంచెం పెద్దవారైతే ఇంటర్నెట్‌ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాంటి వారికి ఇంటర్నెట్ వాడకానికి సంబంధించిన జాగ్రత్తలను వివరించండి. లొకేషన్ని ఆఫ్ చేయడం, వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకుండా ఉండడం.. వంటివి ఇందులో భాగమే.
* పిల్లలు ఆడుకుంటూ దెబ్బలు తగిలించుకోవడం సహజంగా జరుగుతుంటుంది. ఒకవేళ మీరు లేనప్పుడు ఇలా జరిగితే వారే సొంతంగా ఫస్ట్ ఎయిడ్ చేసుకునేలా శిక్షణ ఇవ్వండి. ఇది చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది.
* ఇంట్లో ఉండే మందులను వారికి దూరంగా ఉంచండి.
గమనిక: పైన చెప్పిన జాగ్రత్తలను వారు ఎలా ఆచరిస్తారో ఒకసారి స్వయంగా పరీక్షించి చూడండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- Asoka Makeup Trend: అప్పటి కరీనా లుక్‌ని ఇలా రీక్రియేట్ చేస్తున్నారు!
- ధవళవర్ణంలో దేవకన్యలా..!
- తారలు మెచ్చిన ‘ఫుల్కారీ’ ఫ్యాషన్.. ఈ స్టైలిష్ ట్రెండ్ గురించి తెలుసా?
- పొడవైన శిరోజాలతో... గిన్నిస్‌బుక్‌లో..!
- ఈ ఆహారంతో జుట్టు ఆరోగ్యంగా..!
ఆరోగ్యమస్తు
- వీటితో.. కడుపు చల్లగా.. ఆరోగ్యంగా..!
- చనుబాలు ఎక్కువగా వస్తున్నాయి.. తగ్గేదెలా?
- మెనోపాజా... వ్యాయామం చేయండి!
- ఎండకో గొడుగు..!
- హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!
అనుబంధం
- నాన్నంటే భయపడుతున్నారు..!
- ప్రయోగాలతో నేర్పిద్దామా?
- పెంపకం బట్టి ఎదుగుతారు.!
- బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నారా?
- లవ్ మ్యారేజ్.. అయినా సంప్రదాయాల పేరిట టార్చర్ చేస్తున్నాడు..!
యూత్ కార్నర్
- టీనాతో ఇంటర్వ్యూకి సిద్ధమా?!
- రాయల్ సొసైటీలో మన స్వెత్లానా!
- వేసవి కథ!
- 29 బాటిళ్లతో ఒక స్విమ్‌సూట్.. విదేశాల్లోనూ పాపులర్!
- Prachi Nigam: స్టేట్ ఫస్ట్.. అయినా బాడీ షేమింగ్ తప్పలేదు!
'స్వీట్' హోం
- ఫర్నిచర్‌పై మరకలు పోవాలంటే..!
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- తేలిగ్గా వండేద్దాం..!
వర్క్ & లైఫ్
- పట్టు చిక్కాలంటే... ప్రణాళిక ఉండాలి...
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
- రంగులు తెలిసేలా!
- విజయానికి అందం అడ్డయ్యింది!
- భరణం ఇవ్వాల్సొస్తుందని ఉద్యోగం మానేశాడు!