సైక్లింగ్ ఎందుకు మంచిదో తెలుసా?

అందంగా, ఆరోగ్యంగా, నాజూగ్గా ఉండాలని ఎవరికుండదు చెప్పండి? అయితే ఇలా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడమూ ముఖ్యమే! ఈ విషయానికొస్తే.. సైక్లింగ్‌ చక్కటి వ్యాయామం....

Published : 03 Jun 2023 18:07 IST

అందంగా, ఆరోగ్యంగా, నాజూగ్గా ఉండాలని ఎవరికుండదు చెప్పండి? అయితే ఇలా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడమూ ముఖ్యమే! ఈ విషయానికొస్తే.. సైక్లింగ్‌ చక్కటి వ్యాయామం అంటున్నారు నిపుణులు. రోజూ సైకిల్ తొక్కడం ద్వారా అన్ని శరీర భాగాలకు వ్యాయామం అంది త్వరగా బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యపరంగా మరెన్నో ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు. ‘ప్రపంచ సైకిల్‌ దినోత్సవం’ సందర్భంగా సైక్లింగ్‌ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి..

సైక్లింగ్ ద్వారా హృదయ సంబంధిత కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. వేగంగా సైకిల్‌ తొక్కేటప్పుడు కాళ్లకు అవసరమయ్యే శక్తిని అందించడానికి గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. ఫలితంగా ఎక్కువ మొత్తంలో క్యాలరీలు ఖర్చవుతాయి. రోజూ 30 నిమిషాల పాటు సైకిల్‌ తొక్కడం వల్ల దాదాపు 75 నుంచి 670 అదనపు క్యాలరీలు ఖర్చవుతాయట!

సైకిల్ తొక్కడం వల్ల శరీర భాగాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే రక్తంలో ఉండే కొవ్వు శాతాన్ని తగ్గించేందుకు కూడా ఇది సహకరిస్తుంది. ఫలితంగా రక్తపోటు అదుపులో ఉంటుంది.

రెగ్యులర్‌గా సైకిల్ తొక్కే వారిలో రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పలు అధ్యయనాల్లో రుజువైంది.

సైకిల్ తొక్కేటప్పుడు శరీరంలోని ప్రధాన కండరాలన్నీ కలిసి పని చేస్తాయి కాబట్టి కండరాల సామర్థ్యాన్ని పెంచడానికి ఇదొక చక్కని వ్యాయామంగా ఉపకరిస్తుంది.

రోజూ సైకిల్ తొక్కడం వల్ల కీళ్ల కదలికల్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అందుకే ఆస్టియోపొరోసిస్, కీళ్ల సంబంధిత సమస్యలతో బాధపడే వారిని సైకిల్ తొక్కమని వైద్యులు సూచిస్తారు.

ఒత్తిడి స్థాయులు తగ్గడం, ఎముకలు మరింత బలంగా మారడం, శరీరంలోని కొవ్వు స్థాయులు తగ్గడం, డిప్రెషన్.. వంటి మానసిక సమస్యల నుంచి బయటపడడం.. ఈ ప్రయోజనాలన్నీ చేకూరాలంటే రోజూ అరగంట సైకిల్‌ తొక్కాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్