ఈ ఆహారంతో మేని మెరుపు మీ సొంతం!

చర్మ సంరక్షణ అంటే కేవలం సౌందర్య ఉత్పత్తులు వాడడం మాత్రమే కాదు.. పోషకాహారానికీ ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే అందంగా, యవ్వనంగా కనిపించచ్చు. అసలు చర్మ ఆరోగ్యం కోసం ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో చూద్దాం..

Published : 05 Mar 2022 16:46 IST

చర్మ సంరక్షణ అంటే కేవలం సౌందర్య ఉత్పత్తులు వాడడం మాత్రమే కాదు.. పోషకాహారానికీ ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే అందంగా, యవ్వనంగా కనిపించచ్చు. అసలు చర్మ ఆరోగ్యం కోసం ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో చూద్దాం..

బాదం..

బాదంపప్పులో విటమిన్‌‘ఇ’ పుష్కలంగా లభిస్తుంది. రోజూ కొన్ని బాదం గింజల్ని తీసుకున్నట్లయితే చర్మం ఆరోగ్యంగా మారుతుంది. వయసు పైబడిన ఛాయలు త్వరగా దరిచేరవు.

చేపలు..

చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. తరచూ చేపలు తినడం చర్మానికి ఎంతో మంచిది. మృతకణాలు తొలగిపోయి కొత్త కణాలు ఏర్పడతాయి.

డార్క్‌ చాక్లెట్‌..

డార్క్‌ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిపించి, మృదుత్వాన్ని అందిస్తాయి.

గ్రీన్‌ టీ

అందాన్ని కాపాడుకోవాలనుకునే వారు మామూలు టీ, కాఫీల కంటే గ్రీన్‌టీకి ప్రాధాన్యమివ్వాలి. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు యాంటీ ఏజింగ్‌ కారకాలుంటాయి. ప్రతిరోజూ కనీసం మూడు కప్పులైనా గ్రీన్‌ టీ తీసుకుంటే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

పాలకూర

పాలకూరలో ఖనిజాలు, విటమిన్లు ఎక్కువ. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు చర్మాన్ని మెరిపిస్తాయి. అందుకే వారంలో మూడు నాలుగు సార్లు పాలకూరను తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్