చారలు తగ్గించే... బొప్పాయి!

ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల అసమతుల్యత వంటివి కళ్లకింద నల్లటి వలయాలు, గీతలు ఏర్పడేలా చేస్తాయి. ముఖాన్ని నిర్జీవంగా మార్చేస్తాయి. ఇలాంటప్పుడు ఈ చిట్కాలు పాటించి చూడండి.‌బొప్పాయి గుజ్జు, టొమాటో రసాన్ని సమపాళ్లలో తీసుకుని కళ్లకిందే కాదు

Published : 20 Sep 2021 01:03 IST

ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల అసమతుల్యత వంటివి కళ్లకింద నల్లటి వలయాలు, గీతలు ఏర్పడేలా చేస్తాయి. ముఖాన్ని నిర్జీవంగా మార్చేస్తాయి. ఇలాంటప్పుడు ఈ చిట్కాలు పాటించి చూడండి.

* బొప్పాయి గుజ్జు, టొమాటో రసాన్ని సమపాళ్లలో తీసుకుని కళ్లకిందే కాదు...ముఖమంతా రాయండి. దాన్ని అలానే పదినిమిషాల పాటు వదిలేసి ఆపై చల్లటి నీటితో కడిగేసుకుంటే సరి. ఇలా కనీసం రెండు రోజులకోసారైనా చేస్తుంటే క్రమంగా సమస్య దూరమవుతుంది.

* బంగాళాదుంప రసంలో కొద్దిగా ఆముదం కలిపి మృదువుగా కళ్లకింద, చెంపలు, నుదురు వంటి చోట్ల రాయండి. చారలు తగ్గుతాయి. వన్నె పెరుగుతుంది.

* వాడేసిన గ్రీన్‌టీ బ్యాగ్‌ని ఫ్రిజ్‌లో పెట్టి...ఆపై దాన్ని నిద్రపోయే ముందు మూసిన కనురెప్పలపై ఉంచండి. ఇలా పది  నిమిషాలు ఉంచితే సరి. క్రమంగా మీరు కోరుకున్న మార్పు సొంతమవుతుంది. కళ్లకు తగిన విశ్రాంతి లభిస్తుంది.

* రోజూ బయట నుంచి ఇంటికి వచ్చాక చల్లటి పాలను కంటి చుట్టూ రాసుకోవాలి. ఆపై ఆరాక కడిగేసుకుంటే కంటి చుట్టూ ఉండే నలుపు, ముడతలు వంటివి తగ్గుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్