శిరోజాలకు పరిమళం..
వేసవిలో చెమటతో జుట్టు తడిసి ముద్దవుతుంది. ఫలితంగా చుండ్రు, దురదతోపాటు వాసన. దీన్నుంచి రక్షణకు కొన్ని పరిమళ ద్రవ్యాలను తయారు చేసుకోవచ్చు. ఇవి శిరోజాలను తాజాగా ఉంచి, సువాసననూ ఇస్తాయి. పైగా జుట్టునూ పరిరక్షిస్తాయంటున్నారు నిపుణులు.
వేసవిలో చెమటతో జుట్టు తడిసి ముద్దవుతుంది. ఫలితంగా చుండ్రు, దురదతోపాటు వాసన. దీన్నుంచి రక్షణకు కొన్ని పరిమళ ద్రవ్యాలను తయారు చేసుకోవచ్చు. ఇవి శిరోజాలను తాజాగా ఉంచి, సువాసననూ ఇస్తాయి. పైగా జుట్టునూ పరిరక్షిస్తాయంటున్నారు నిపుణులు. వాటి తయారీ ఎలాగో చూడండి...
గులాబీ రేకలతో.. రెండు గులాబీ పూల నుంచి రేకలను తీసి ఆరనిచ్చి పొడి చేయాలి. మరో గులాబీ రేకలను విడిగా తీసి ఉంచాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి పావు లీటరు నీళ్లు పోయాలి. అవి వేడెక్కాక గులాబీ రేకలను వేసి చిన్నమంట మీద బాగా మరగనివ్వాలి. గులాబీలో ఉండే ఎసెన్స్ పూర్తిగా నీటిలో దిగుతుంది. ఇందులో గులాబీ రేకల పొడిని రెండు చెంచాలు వేసి పావుగంట బాగా మరిగించి వడ కట్టాలి. ఇందులో చెంచా కలబంద గుజ్జు, అయిదు చుక్కల లావెండర్ నూనె, అరచెంచా రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి మరోసారి కలిపి స్ప్రే సీసాలో భద్రపరుచుకోవాలి. బయటికి వెళ్లేటప్పుడు జుట్టుకు దీన్ని స్ప్రే చేసుకుంటే చాలు. రోజంతా శిరోజాలను తాజాగా ఉంచడమే కాకుండా కాలుష్యం నుంచీ కాపాడుతుంది. మాడును ఆరోగ్యంగా ఉండేలానూ చేస్తుంది.
నారింజతో.. అరకప్పు గులాబీ నీళ్లలో 15 చుక్కల గులాబీ నూనె, అయిదారు చుక్కల నారింజ నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే సీసాలో నింపి బాగా షేక్ చేసి చల్లని ప్రదేశంలో భద్రపరచాలి. తలస్నానం చేసి, బయటకు వెళ్లేటప్పుడు జుట్టుకు స్ప్రే చేసుకుంటే చాలు. శిరోజాలకు పరిమళం వ్యాపిస్తుంది. మాడుపై మురికీ పేరుకోదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- Met Gala 2024: గ్రీన్ కార్పెట్‌పై తారల సొగసులు!
- మండే ఎండల్లో... ఫ్రెష్‌గా ఉండాలంటే..!
- ఉంగరం... ఆడంబరం!
- మేకప్ మరకలా?
- ఈ వేసవి సమస్యలకు.. ఇలా చెక్ పెట్టేయండి!
ఆరోగ్యమస్తు
- వేడికి... సహజ మంత్రం!
- నలభై దాటాక.. ఇమ్యూనిటీ పెరగాలంటే..!
- No Diet Day: నచ్చింది తిందాం.. మనల్ని మనం ప్రేమించుకుందాం!
- ఆడుతూ పాడుతూ... ఆరోగ్యంగా!
- ఏకాగ్రతను పెంచే బంతాట
అనుబంధం
- ఆపొద్దు.. ఎగరనిద్దాం!
- అందుకే.. కాస్త రొమాన్స్ కూడా జోడించాల్సిందే..!
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- టిక్ టాక్ టో ఆడిద్దామా!
- పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా?
యూత్ కార్నర్
- ఆ గౌను కోసం... పదివేల గంటలు!
- ఆ లెహెంగా తయారీకి 1400 గంటలు!
- వీగన్ ఉత్పత్తులతో... రూ.830 కోట్ల వ్యాపారం!
- ఈ అమ్మాయిలు... యునిసెఫ్ అంబాసిడర్లు!
- నవ్వుల మారాణులు!
'స్వీట్' హోం
- వాషింగ్ మెషీన్ వాడేద్దామిలా!
- పనిభారం ఉండదిక..!
- అప్పులు తెమ్మంటున్నాడు... విడాకులు తీసుకోనా?
- టైల్స్ మధ్య మురికి.. పోవాలంటే!
- మొక్కలు... సురక్షితమిలా!
వర్క్ & లైఫ్
- ఓటు కోసం... వేల మైళ్లు
- భర్త నచ్చకపోతే విడాకులు.. గ్రాండ్‌గా ‘పార్టీ’ కూడా చేసుకుంటారు!
- పెదవి కొరుకుతున్నారా..!
- Elections 2024: ఎన్నికల బరిలో అందాల తారలు!
- నవ్వు... నాయకత్వం!