మీ కళ్లు చిన్నవా..?

చారడేసి కళ్లకుండే అందం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అందరూ కళ్లూ అలా ఉండవుగా. కొందరివి చిన్నగా ఉంటాయి.  అలాంటప్పుడు మేకప్‌తో ఇలా మాయ చేయండి.

Published : 23 May 2022 01:50 IST

చారడేసి కళ్లకుండే అందం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అందరూ కళ్లూ అలా ఉండవుగా. కొందరివి చిన్నగా ఉంటాయి.  అలాంటప్పుడు మేకప్‌తో ఇలా మాయ చేయండి. అందమైన కళ్లను తీర్చిదిద్దుకోండి...

న్న కళ్లనే పెద్దగా కనిపించేలా మేకప్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం  ముందుగా కనుబొమలను తీర్చిదిద్దుకోవాలి. ఐబ్రో పెన్సిల్‌తో కనుబొమలకు ఒక మంచి షేప్‌ వచ్చేలా చేయాలి. ముఖం ఆకారాన్ని బట్టి వీటిని తీర్చిదిద్దితే చాలు. అలాగే కంటికి, వీటికి మధ్య దూరం ఎక్కువగా ఉంటే కళ్లు పెద్దగా కనిపించడానికి అవకాశం ఉంటుంది.

కనురెప్పలు..: ఇవి ఎంత ఒత్తుగా ఉంటే అంత విశాలమైన కళ్లు అనిపిస్తాయి. ఐలైనర్‌తో రెప్పలపై ముందుగా ఒక లైన్‌ వేసుకోవాలి. ఆ  తర్వాత కనురెప్పలకు మస్కారా అద్దాలి. ఒత్తుగా అనిపించిన తర్వాత మస్కారా బ్రష్‌తో రెండుమూడు సార్లు కర్లింగ్‌ చేసుకోవాలి. ప్రస్తుతం వీటిని ఒత్తుగా కనిపించేలా చేయడానికి టెంపరరీ అటాచ్డ్‌ ఐ ల్యాషస్‌ మార్కెట్‌లో దొరుకుతున్నాయి. పార్టీలు, శుభకార్యాలు వంటి ముఖ్యమైన సందర్భాల్లో వీటిని వినియోగిస్తే మరింత బాగుంటుంది. అయితే కంటి కింది భాగంలో రెప్పలకు మాత్రం లైనర్‌ను అప్లై చేయకూడదు. ఇలా చేస్తే కళ్లు చిన్నవిగా అనిపిస్తాయి. కంటిపైరెప్పలకే మస్కారా వాడితే చాలు. దీంతో కళ్లు విశాలంగా ఉన్నట్లుంటాయి.

హైలెట్‌...: కనుబొమ్మల కింద కంటికి పైన కాస్తంత ఫౌండేషన్‌తో హైలైట్‌ చేయాలి. కంటి చివర్లలో పెన్సిల్‌తో చిన్నగా మొనదేరినట్లుగా గీయాలి. ఇది కళ్లను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్