చర్మాన్ని హైడ్రేట్‌ చేస్తున్నారా?

అంటే.. తేమని అందించడమేగా! రోజూ రెండుసార్లు శుభ్రం చేస్తున్నాం.. క్రీమ్‌ కూడా రాస్తున్నాం అంటారా! అది మాయిశ్చరైజింగ్‌. మరీ హైడ్రేటింగ్‌ సంగతేంటి? తెలియదా? చదివేయండి.

Published : 14 Jul 2022 00:52 IST

అంటే.. తేమని అందించడమేగా! రోజూ రెండుసార్లు శుభ్రం చేస్తున్నాం.. క్రీమ్‌ కూడా రాస్తున్నాం అంటారా! అది మాయిశ్చరైజింగ్‌. మరీ హైడ్రేటింగ్‌ సంగతేంటి? తెలియదా? చదివేయండి.

ర్మం ఆరోగ్యంగా, తాజాగా కనిపించడానికి తేమ కావాలి. దాన్ని మాయిశ్చరైజర్‌ రూపంలో అందిస్తాం కదా! కొన్నిసార్లు ఎంత క్రీములు రాసినా, పూతలు వేసినా ప్రభావం పెద్దగా కనిపించదు. అదనంగా పొడి బారినట్లుగా.. జీవం కోల్పోయినట్లుగా తయారవుతుంది. కణాల్లో నీటిశాతం తగ్గడమే అందుకు కారణం. వీటికి తగినంత నీరు అందినప్పుడే అవి ఉబ్బినట్లుగా ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఈ పనిని మాయిశ్చరైజర్లు చేయలేవు. పైగా వయసు పైబడటం, ఎండ వేడికి చర్మం పాడవడం తద్వారా పొరల్లో డెడ్‌సెల్స్‌ ఏర్పడటం జరిగితే దాని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది.

మాయిశ్చరైజర్‌.. చర్మానికి గొడుగు లాంటిది. దీనిలో పెట్రోలియం, మినరల్‌ ఆయిల్స్‌, ప్లాంట్‌ ఆయిల్స్‌ వంటి నూనె ఆధారిత పదార్థాలు ఎక్కువ. ఇవి చర్మకణాలను లాక్‌ చేసి, లోపలి తేమ బయటికి వెళ్లకుండా చేస్తాయి. హైడ్రేటర్లు అలా కాదు. ఇవి కణాల మధ్య నీటిని పట్టి ఉంచడంలో సాయపడతాయి. గ్లిజరిన్‌, హ్యాలురోనాయిక్‌ ఆసిడ్‌ వంటి వాటిని హైడ్రేటర్లుగా చెబుతాం. వాటిని తప్పక వాడాలి. వారానికి రెండుసార్లు స్క్రబింగ్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇంకా రోజువారీ చర్మ పరిరక్షణలో హైడ్రేటింగ్‌ సీరమ్‌ను చేర్చుకోవడం మంచిది. స్క్రబ్‌ చేసిన ప్రతిసారీ అలోవెరా, తేనెల మిశ్రమాన్ని రాసినా ఫలితం ఉంటుంది. ప్రయత్నించండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్