బరువు తగ్గించే సైకిల్‌ సవారీ

కరోనా కారణంగా కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లే పని తగ్గింది. దాంతో వ్యాయమం చేయడంలో అలసత్వం పెరిగింది. అధికబరువు, హార్మోన్ల పనితీరులో మార్పులు చాలానే కనిపిస్తున్నాయి. వాటి నుంచి బయటపడాలంటే... కసరత్తులు అవసరం. అందుకే సరదాగా సైక్లింగ్‌ చేయండి!  

Published : 21 Jul 2021 00:28 IST

కరోనా కారణంగా కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లే పని తగ్గింది. దాంతో వ్యాయమం చేయడంలో అలసత్వం పెరిగింది. అధికబరువు, హార్మోన్ల పనితీరులో మార్పులు చాలానే కనిపిస్తున్నాయి. వాటి నుంచి బయటపడాలంటే... కసరత్తులు అవసరం. అందుకే సరదాగా సైక్లింగ్‌ చేయండి!  
మీరు ప్రతిరోజూ పరుగెట్టినా కొన్నిసార్లు కార్డియో వ్యాయామ ఫలితం శరీరానికి అందకపోవచ్చు. దానికి కారణం రోజూ ఒకేలాంటి తరహా కసరత్తులు చేయడం కారణం కావొచ్చు. ప్రత్యామ్నాయంగా సైక్లింగ్‌ని ఎంచుకోండి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాదు... శ్వాసకోశ వ్యవస్థను దృఢంగా ఉంచుతుంది.
*సైక్లింగ్‌ వల్ల శరీరం కింది భాగంలోని కండరాలు దృఢమవుతాయి. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఈ వ్యాయామం శరీరానికి, మెదడుకి మధ్య బ్యాలెన్స్‌ చేస్తుంది. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా నెలసరుల్లో ఇబ్బందులు అదుపులోకి వస్తాయి.  
* సైకిల్‌ తొక్కడం వల్ల శరీరంలో అదనంగా పేరుకున్న కెలొరీలు త్వరగా కరుగుతాయి. ముఖ్యంగా నడుం కింది భాగం తొడలూ వంటి ప్రదేశాల్లో అదనంగా ఉండే కొవ్వు త్వరగా కరుగుతుంది. కీళ్లూ దృఢంగా మారతాయి.
* బరువు తగ్గాలనే లక్ష్యం పెట్టుకునే వారికి ఇది చక్కని వ్యాయామం. రోజూ కనీసం ఇరవై నిమిషాలు చేస్తే ఇది మీకు మంచి ఫలితాన్నిస్తుంది అంటున్నారు నిపుణులు. అలానే తక్కువ రిస్క్‌తో చేయగలిగే కసరత్తు కూడా ఇదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్