ఆ సమయంలో విశ్రాంతి అవసరం

నెలసరి దగ్గర పడుతున్న కొద్దీ చాలా మందిలో ఆందోళన, చిరాకు పెరుగుతాయి. ముఖ్యంగా ఆ రోజుల్లో కొందరు మహిళలు మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడతారు. కొన్ని చిట్కాలతో ఆ నెలసరి బాధల నుంచి కాస్త ఉపశమనాన్ని పొందొచ్చు. ఎలానో తెలుసుకుందామా..

Updated : 16 Sep 2021 05:45 IST

నెలసరి దగ్గర పడుతున్న కొద్దీ చాలా మందిలో ఆందోళన, చిరాకు పెరుగుతాయి. ముఖ్యంగా ఆ రోజుల్లో కొందరు మహిళలు మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడతారు. కొన్ని చిట్కాలతో ఆ నెలసరి బాధల నుంచి కాస్త ఉపశమనాన్ని పొందొచ్చు. ఎలానో తెలుసుకుందామా..

* ఆ సమయంలో నిద్రకు, విశ్రాంతికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలి.

* వేడి వేడిగా పాలు లేదా చమోలీ, అల్లం, గ్రీన్‌ టీ తాగితే ఉపశమనంగా ఉంటుంది. ఈ సమయంలో కెఫిన్‌ ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే ఆహారంలో పిండి పదార్థాలు, చక్కెర, ఉప్పులను తగ్గించాలి. జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండాలి. పోషకాలుండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వాటిలోని యాంటీఆక్సిడెంట్లు మేలు చేస్తాయి.

* పెద్ద పెద్ద కసరత్తులు వద్దు. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలపై దృష్టి పెట్టాలి.

* వీలైతే ఓ నోటు పుస్తకంలో ఆ సమయంలో మీకు కలిగే ఆలోచనలను రాయండి.

* ఇష్టమైన సినిమానో, కార్టూనో చూడండి. నచ్చిన పుస్తకం చదవండి. గోరువెచ్చటి నీటితో స్నానం మీ ఒంటి నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలగజేస్తుంది.

* ఆ టైమ్‌లో ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల శరీరం ఊరికే నీరసించి పోదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్