అలా తగ్గకూడదు

బరువు విషయంలో అమ్మాయిలు ఎక్కువ దృష్టి పెడుతుంటారు. తక్కువ సమయంలో సన్నబడే ప్రకటనలు, చిట్కాలు వారిని ఎక్కువ ఆకర్షిస్తుంటాయి. ఇక కొందరైతే చూసినవన్నీ ప్రయత్నిస్తుంటారు.

Updated : 18 Aug 2022 15:39 IST

బరువు విషయంలో అమ్మాయిలు ఎక్కువ దృష్టి పెడుతుంటారు. తక్కువ సమయంలో సన్నబడే ప్రకటనలు, చిట్కాలు వారిని ఎక్కువ ఆకర్షిస్తుంటాయి. ఇక కొందరైతే చూసినవన్నీ ప్రయత్నిస్తుంటారు. ఇలా వేగంగా తగ్గడం మంచిది కాదంటున్నారు నిపుణులు.
ఒక్కసారిగా బరువు పెరగడం, తగ్గడం ఆరోగ్య లక్షణం కాదు. ఫలితం తాత్కాలికంగా ఆనందం కలిగించినా.. దీర్ఘకాలంలో ఎన్నో సమస్యలొస్తాయి. కాబట్టి క్రమంగా, ఒక పద్ధతిలో సాగేలా ప్లాన్‌ చేసుకోవాలి.
* కొంతమంది ఎవరెవరో చెప్పిన చిట్కాలు, తారలు పాటించిన వాటిని అనుసరిస్తుంటారు. రెండూ తప్పే. ఒక్కొక్కరి శరీర తీరు ఒక్కోలా ఉంటుంది. దానికి అనుగుణంగానే డైట్‌, వ్యాయామాలుంటాయి.
* ఒక్కసారిగా తగ్గిన వారిలో ఎలక్ట్రోలైట్‌ల అసమతుల్యత, న్యూట్రిషన్‌ డెఫిషియన్సీతోపాటు థైరాయిడ్‌ సమస్యలూ తలెత్తుతాయి. కాబట్టి పోషకాహారంపై తప్పక దృష్టిపెట్టాలి. అలాగే నెలకు 2 - 4 కిలోలకు మించి తగ్గకుండా చూసుకోవాలి.
* డైట్‌ అనగానే అమ్మాయిలు ఎక్కువ చేసే పని నోరు కట్టేసుకోవడం. కానీ దీనివల్ల ఒక్కసారిగా కెలోరీలు తగ్గి శరీరం ఇబ్బందిపడుతుంది. అలాగని ప్రోటీన్లపైనా ఎక్కువ ఆధారపడకూడదు. మూత్రపిండ సంబంధ సమస్యలొస్తాయి. ఇన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్