చల్లగాలికి గొంతు జాగ్రత్త

ఉదయం లేచినప్పటి నుంచీ మనకి నీటితోనే పని. దీనికి తోడు గచ్చు, గాలి కూడా ఈ కాలంలో చల్లగా మారతాయి. దీంతో ప్రభావం మొదటపడేది గొంతుపైనే! కాబట్టి, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి

Updated : 27 Nov 2021 06:01 IST

ఉదయం లేచినప్పటి నుంచీ మనకి నీటితోనే పని. దీనికి తోడు గచ్చు, గాలి కూడా ఈ కాలంలో చల్లగా మారతాయి. దీంతో ప్రభావం మొదటపడేది గొంతుపైనే! కాబట్టి, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి

కాలంలో దాహమేయదు. కాబట్టి, మరీ దాహమైతే తప్ప నీటి జోలికి వెళ్లం. ఇది మంచిది కాదు. గుర్తుంచుకుని మరీ నీళ్లు తాగాలి. శీతల పానీయాలను దూరంపెట్టి తాజా పండ్లరసాలను తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే కీర, పుచ్చకాయ లాంటివి మరీ మంచిది. మామూలు కాఫీ, టీల బదులు హెర్బల్‌, గ్రీన్‌ టీ ప్రయోజనకరం.

* పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లం లేదా తేనె వాడండి. అతి చల్లగా లేదా అతి వేడిగా తినొద్దు, తాగొద్దు. నాలుగు తులసి ఆకులను నీళ్లలో మరిగించి, చల్లార్చి తాగుతుంటే దగ్గు, కఫం లాంటి ఇబ్బందులు తలెత్తవు.

* గొంతు బొంగురుగా ఉంటే మిరియాల కషాయం తాగండి. ఆరేడు మిరియాలను పొడిచేసి బెల్లంతో ఉండలా చేసి మింగినా ఫలితముంటుంది. జలుబు కూడా అనిపిస్తే ఆవిరి పట్టాలి.

* తగినంత నిద్ర లేకున్నా గొంతు సమస్యలు రావచ్చు. కనుక నిద్రను నిర్లక్ష్యం చేయొద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్