నెలసరి శుభ్రంగా...

పీరియడ్స్‌లో పరిశుభ్రత పాటించకపోతే ఎన్నో ఇబ్బందులు.. అనారోగ్యాలు. వాటినెలా ఎదుర్కోవాలంటే..

Published : 29 Nov 2021 01:27 IST

పీరియడ్స్‌లో పరిశుభ్రత పాటించకపోతే ఎన్నో ఇబ్బందులు.. అనారోగ్యాలు. వాటినెలా ఎదుర్కోవాలంటే..

* రక్తస్రావం ఎక్కువైతే ఒకటికి రెండు ప్యాడ్లు వాడుతుంటారు. ఈ అలవాటు ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఒకేసారి రెండు వాడే బదులు.. తరచూ మార్చుకోండి.

*  అంతర్గత భాగాల్ని సబ్బులకు బదులు వేడినీళ్లతో శుభ్రం చేసుకోవడం మేలు. సబ్బుల్లోని రసాయనాలు  పీహెచ్‌ స్థాయులను బ్యాలెన్స్‌ లేకుండా చేస్తాయి. ఫలితంగా ఆ ప్రాంతం పొడిబారడం, దురదలాంటి ఇబ్బందులొస్తాయి.

* కొన్ని రకాల ప్యాడ్లు కొందరికి పడవు. ముఖ్యంగా తొడల దగ్గర ర్యాష్‌ని కలిగిస్తాయి. అలాంటప్పుడు స్నానం చేసిన తర్వాత, నిద్రపోయే ముందు ఆయా ప్రాంతాల్లో యాంటీసెప్టిక్‌ క్రీమ్‌ని రాసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్