నిద్రపట్టడం లేదా...

ఆరోగ్యంగా ఉండాలంటే 7, 8 గంటల నిద్ర అవసరం. కానీ చాలామంది మహిళలు నిద్రలేమితో సతమతమవుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడే సూచనలివి..

Published : 24 Dec 2021 00:57 IST

ఆరోగ్యంగా ఉండాలంటే 7, 8 గంటల నిద్ర అవసరం. కానీ చాలామంది మహిళలు నిద్రలేమితో సతమతమవుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడే సూచనలివి..

* ఆదమరచి నిద్ర పోవడంవల్ల రోజంతా చేసిన శ్రమ, కలిగిన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతాం. నిద్రలేమి ఆ అలసటను రెట్టింపు చేస్తుంది. ఏవైనా సమస్యల వల్ల నిద్ర పట్టకుంటే డాక్టర్‌ను సంప్రదించాలి. లేదంటే మరిన్ని అనారోగ్యాలు దాడిచేస్తాయి.

* రోజూ ధ్యానానికీ, యోగాకి గంట సమయం వెచ్చిస్తే మానసిక, శారీరక ఆరోగ్యాలు సొంతమై నిద్రలేమి ఉండదు.

* కాఫీ, టీలు ఒకటి రెండుసార్ల కంటే తాగొద్దు. నిద్రకు ఉపక్రమించే ముందు టీవీ, మొబైల్స్‌ను దూరం పెట్టండి.

* తినగానే పడుకోవద్దు. కొద్దిసేపు నడవండి. లేదా వ్యాయామం చేయండి. పడుకునే ముందు గోరువెచ్చటి నీటిలో కాస్త యూకలిప్టస్‌ ఆయిల్‌ కలిపి స్నానం చేస్తే చక్కగా నిద్ర పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్