పాదాలకు ప్యాడ్స్‌...

శరీర బరువుని మోసే పాదాలను సంరక్షించడానికే ఈ ప్యాడ్స్‌. ఉదయం నుంచి వ్యాయామాలు, నడక అంటూ అలసటకు గురయ్యే పాదాలకు సుతిమెత్తగా ఉంటూ ఎంతో రక్షణనిస్తున్నాయి. పాదం అడుగుభాగాన్నంతటికీ

Updated : 07 Jan 2022 05:09 IST

శరీర బరువుని మోసే పాదాలను సంరక్షించడానికే ఈ ప్యాడ్స్‌. ఉదయం నుంచి వ్యాయామాలు, నడక అంటూ అలసటకు గురయ్యే పాదాలకు సుతిమెత్తగా ఉంటూ ఎంతో రక్షణనిస్తున్నాయి. పాదం అడుగుభాగాన్నంతటికీ సంరక్షణగా ‘ఫుట్‌ ప్యాడ్స్‌’, ఎక్కువదూరం నడిచేటప్పుడు, పరుగుపెట్టేటప్పుడు ‘ఫుట్‌ స్టిక్కర్స్‌’, అలసిన పాదాల మడమలకు ఉపశమనంగా ‘సిలికాన్‌ జెల్‌ హీల్‌ స్లీవ్స్‌’, వేళ్ల అడుగుభాగాన మెత్తగా అనిపించేలా ‘కుషన్స్‌’, ఎత్తుమడమలు వేసేటప్పుడు పాదాలు ఒత్తిడికి గురికాకుండా ‘స్టిక్కర్లు’ వంటివెన్నో వీటిలో ఉన్నాయి. అలాగే ‘డిటాక్స్‌ ప్యాడ్స్‌’తో పగలంతా అలసిన పాదాలకు ఉపశమనాన్ని కూడా పొందొచ్చు. మీ మృదువైన పాదాలకూ ఈ ప్యాడ్స్‌ ఉపయోగపడతాయేమో. ఓ సారి చూసేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్