అల్పాహారానికి సమయం లేదా...

మనలో చాలా మంది పనుల్లో పడి టిఫిన్‌ తినకుండా ఒకేసారి భోజనం చేయొచ్చులే అనుకుంటారు. ఇలా చేస్తే ఎసిడిటీ, అల్సర్లు లాంటి అనారోగ్యాలు దాడి చేస్తాయట. టిఫిన్‌ చేసుకొనే సమయం లేని వాళ్లు ఇవి ప్రయత్నించండి..

Updated : 11 Feb 2022 06:05 IST

మనలో చాలా మంది పనుల్లో పడి టిఫిన్‌ తినకుండా ఒకేసారి భోజనం చేయొచ్చులే అనుకుంటారు. ఇలా చేస్తే ఎసిడిటీ, అల్సర్లు లాంటి అనారోగ్యాలు దాడి చేస్తాయట. టిఫిన్‌ చేసుకొనే సమయం లేని వాళ్లు ఇవి ప్రయత్నించండి..

* పెసలు, సెనగలు, పల్లీలు లాంటివి పొద్దున్నే నానబెట్టి రాత్రిపూట నీళ్లు పారబోసి అలా ఉంచేస్తే సరి. ఈ మొలకెత్తిన గింజల మీద కాస్త మిరియాల పొడి చల్లుకుని తినొచ్చు. ఇలా నచ్చలేదంటే తాలింపులో కొద్దిగా వేయించి ఉప్పూకారం వేసుకుని తినొచ్చు. ఎక్కువ వేయిస్తే పోషకాలు తరిగిపోతాయండోయ్‌.
* రవ్వ ఉప్మా అంత సమయం పట్టదు.. కనుక అటుకుల ఉప్మా చేసుకోవచ్చు. అంత సమయం కూడా లేదంటే వేడి పాలల్లో అటుకులు, బెల్లం వేసి తినొచ్చు.
* బ్రౌన్‌ బ్రెడ్‌ ఆరోగ్యానికి మంచిది. తీపి ఇష్టపడే వాళ్లు జామ్‌తో కారం ఇష్టపడేవాళ్లు సాస్‌తో తినొచ్చు. లేదా ఉల్లి, క్యాప్సికం, కొత్తిమీర తరిగి స్లైసుల మధ్యలో పెట్టుకుని తినొచ్చు. కాస్త నెయ్యి రాసి టోస్టర్‌లో అర నిమిషంలో వేయించి తినొచ్చు.
* ఓట్స్‌ను నీళ్లతో ఉడికించి కొన్ని పాలు, కొద్దిగా బెల్లం వేసి తింటే పాయసాన్ని తలపిస్తుంది. తీపి ఇష్టం లేనివాళ్లు ఉడికించిన ఓట్స్‌ చల్లారాక మజ్జిగ కలిపి తాగొచ్చు. దీనికి రెండు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. బాదం, అంజీర్‌, ఎండు ఖర్జూరం, జీడిపప్పు- వీటిల్లో ఏదైనా రాత్రిపూట నాలుగు నానబెట్టి పొద్దున్నే తినేస్తే శక్తి ఉంటుంది. లేదనుకుంటే అరటిపండు, యాపిల్‌, పండు ఖర్జూరాలు లాంటివైనా తినొచ్చు. భోజనం చేసేవరకూ ఖాళీ కడుపుతో ఉంటే మాత్రం ఆనక మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్