పొట్టను తగ్గించే‘వి’!

గుట్ట లాంటి పొట్ట కరగాలంటే కాస్త కష్టపడాలి. పొట్ట తగ్గించే వ్యాయామాల్లో వి-అప్స్‌ ఒకటి. దీన్ని ఎలా చేయాలి? ఏమేం చేయొద్దు... చేయడం వల్ల లాభాలేంటో చూద్దామా..

Updated : 25 Feb 2022 15:01 IST

గుట్ట లాంటి పొట్ట కరగాలంటే కాస్త కష్టపడాలి. పొట్ట తగ్గించే వ్యాయామాల్లో వి-అప్స్‌ ఒకటి. దీన్ని ఎలా చేయాలి? ఏమేం చేయొద్దు... చేయడం వల్ల లాభాలేంటో చూద్దామా..

నేల/మ్యాట్‌పై వెల్లకిలా పడుకుని చేతులను తలపైకి నిటారుగా చాపి నేలకు ఆనించాలి. కాళ్లు పూర్తిగా నేలను తాకాలి. ఇప్పుడు నెమ్మదిగా పైకి లేస్తూ కాళ్లనూ పైకి లేపాలి. మెల్ల్లగా చేతులతో కాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఆంగ్ల అక్షరం ‘వి’ భంగిమలో కాసేపు ఉండి తిరిగి యథాస్థానానికి వచ్చేయాలి. కొత్తగా చేసే వారు మొదట రెండు కాళ్లను ఒకేసారి కాకుండా ఒక్కోకాలిని లేపుతూ కూడా చేయొచ్చు. అలవాటు అయ్యాక రెండు కాళ్లతో చేయొచ్చు.

ఫలితాలు... దీని వల్ల పొట్టపై ఒత్తిడి పడి ఆ ప్రాంతంలో కొవ్వు కరగడమే కాకుండా కండరాలు దృఢంగా మారతాయి. పిరుదులు, కాళ్లు, భుజాలకు చక్కటి వ్యాయామం కూడా.

ఈ పొరపాట్లు చేయొద్దు...

కొత్తగా చేసే వారు ఒకే సారి కాళ్లు పట్టుకోవద్దు. అలాగే మరీ వేగంగానూ చేయొద్దు. పూర్వపు స్థితికి వచ్చే సమయంలో వెన్నును నేలకు ఆన్చకుండా లేవకూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్