గర్భిణులకు శ్రేష్టం కర్బూజా...

ఎండలు విసిగించేస్తున్నాయి కదూ! ఈ కాలంలో గర్భిణుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వాళ్లు కొంచెం సేదతీరాలంటే కర్బూజాను ఆశ్రయించాల్సిందే! దీంతో రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం.

Published : 01 Apr 2022 01:26 IST

ఎండలు విసిగించేస్తున్నాయి కదూ! ఈ కాలంలో గర్భిణుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వాళ్లు కొంచెం సేదతీరాలంటే కర్బూజాను ఆశ్రయించాల్సిందే! దీంతో రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం.

* గర్భిణులలో అదనంగా చేరే సోడియంను తొలగించడంలో కర్బూజా సాయపడుతుంది.

* శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేస్తుంది. వేసవి తాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది.

* మూత్రపిండాలను శుద్ధి చేస్తుంది. రాళ్లు ఏర్పడకుండా సంరక్షిస్తుంది.

* కర్బూజాలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నందున మంచి పోషకాహారం.

* జుట్టు రాలడమనేది స్త్రీలను ఆందోళనకు గురిచేసే అంశాల్లో ఒకటి. కర్బూజా కురులను దృఢంగా ఉంచి రాలిపోకుండా కాపాడుతుంది.

* కర్బూజాలో ఉన్న పొటాషియం రక్తపోటును నియంత్రిస్తే, ఇందులో ఉండే పీచుపదార్థాలు జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తాయి.

* ఇందులో సి-విటమిన్‌ తగినంత ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

* కర్బూజాలో ఉన్న ఎ-విటమిన్‌ కంటి చూపును మెరుగుపరుస్తుంది.

* స్త్రీలలో ఎక్కువగా కనిపించే కీళ్ల వాతాన్ని అదుపులో ఉంచుతుంది.

* కర్బూజా చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. రక్తపోటును నివారిస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. నిద్రలేమిని పోగొడుతుంది. మధుమేహంతో బాధపడే వారికి ఇది మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్