పాపాయికి పన్నెండు గంటల నిద్ర!

ఏడాదిలోపు పసిపిల్లలకు రోజుకి 12 నుంచి 16 గంటలు నిద్ర అత్యవసరమంటున్నారు నిపుణులు. రెండేళ్ల లోపువారైతే 8 నుంచి 14 గంటలు నిద్రలోకి జారుకోవాల్సిందే అని సూచిస్తున్నారు. ఆయా

Published : 04 Apr 2022 00:48 IST

ఏడాదిలోపు పసిపిల్లలకు రోజుకి 12 నుంచి 16 గంటలు నిద్ర అత్యవసరమంటున్నారు నిపుణులు. రెండేళ్ల లోపువారైతే 8 నుంచి 14 గంటలు నిద్రలోకి జారుకోవాల్సిందే అని సూచిస్తున్నారు. ఆయా వయసు బట్టి సరిపోయినంతగా నిద్ర లేకపోతే అది వారి ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. శారీరకంగా, మానసికంగా వారు ఆరోగ్యంగా ఉండాలంటే కంటి నిండా నిద్రపోవాల్సిందే అంటున్నారు. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతున్నారిలా.

మెదడు.. శరీరంలో మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎదగాలన్నా పసిపిల్లలు రోజులో సగభాగం నిద్రలో ఉంటేనే మంచిది. సరిపోయినంతగా నిద్ర ఉంటే, ఎదిగిన తర్వాత వారిలో ఆలోచనాశక్తి, సమస్యను పరిష్కరించే నైపుణ్యం, జ్ఞాపకశక్తితోపాటు మెరుగైన మానసికారోగ్యాన్ని పొందుతారు. ఇందుకోసం వారిని రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా అలవాటు చేయాలి. నిద్రకు దూరంగా ఉండే చిన్నారులకు గోరువెచ్చని నీటిలో ముంచిన తువ్వాలుతో ఒళ్లంతా తుడవాలి. కడుపు నిండా పాలు పెట్టి లాలిపాట పాడితే చాలు. బుజ్జాయిలు హాయిగా నిద్రలోకి జారుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు.

పడక... పిల్లలు నిద్రపోయే ప్రాంతమంతా పరిశుభ్రంగా ఉండాలి. దోమలు వంటి కీటకాల బెడద లేకుండా జాగ్రత్తపడాలి. వాతావరణానికి తగినట్లుగా పక్క సర్దాలి. వేసవికాలంలో మెత్తని మృదువైన వస్త్రాన్ని పరిచి దానిపై నిద్రపుచ్చాలి. సౌకర్యంగానే కాకుండా గాలి తగిలేలా ఉంటేనే చిన్నారులకు నిద్రాభంగం కలగదు. వెలుతురు తక్కువగా, శబ్దాలు కలగకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తే చాలు. సుఖంగా నిద్రపోతారు.

కథలతో.. రెండేళ్ల వయసు చిన్నారులకు నిద్రపోయే ముందు వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచాలి. కథలు వినిపించాలి. వారి పక్కన ఉంటూ పెద్దవాళ్లు ఫోన్‌, ల్యాప్‌టాప్‌ వంటివి వినియోగించకూడదు. టీవీ చూడకూడదు. ఏకాగ్రత అంతా పిల్లలపై ఉంచుతూ, వారికోసం ఆ సమయాన్ని కేటాయిస్తే చాలు. అది వారి మనసును ఉల్లాసంగా మార్చి ప్రశాంతంగా నిద్ర వచ్చేలా చేస్తుంది. ఈ వయసు పిల్లలతో పగటిపూట చిన్నచిన్న ఆటలు ఆడించాలి. ఇది వారి కండరాలకు వ్యాయామంగా పనిచేసి, అలసిపోయేలా చేస్తుంది. దీంతో ఆకలి వేసి ఆహారాన్ని తీసుకుంటారు. ఇవన్నీ కూడా మంచి నిద్రకు దారి చూపిస్తాయి. కొందరు చిన్నారులు పక్క తడిపి, ఆ అసౌకర్యంతో నిద్రలో లేస్తారు. నిద్రకు ముందు వాష్‌రూంకు వెళ్లొచ్చే అలవాటు చేయడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్