బరువు తగ్గాలా.. ఇవి తినండి..

జలుబూ జ్వరాలతో జిహ్వ రుచి కోల్పోయి తినేవేవీ సహించనప్పుడు అల్‌బుకారా బుగ్గన పెట్టుకోవడం మనందరికీ అలవాటే.

Updated : 30 Nov 2022 13:12 IST

జలుబూ జ్వరాలతో జిహ్వ రుచి కోల్పోయి తినేవేవీ సహించనప్పుడు అల్‌బుకారా బుగ్గన పెట్టుకోవడం మనందరికీ అలవాటే. అరుచిని, వికారాన్నీ పోగొట్టడమే కాదు.. ఈ పండ్లలో మరెన్నో సుగుణాలున్నాయి. ప్లమ్‌ ఫ్రూట్స్‌గా ప్రపంచ ప్రసిద్ధమైన వీటిల్లో రెండువేల రకాలున్నాయనేది నమ్మశక్యం కాని నిజం. ఇంతకీ ఇవి ఎన్ని రకాలుగా మేలు చేస్తాయో చూద్దాం.

* వీటిలో సి- విటమిన్‌ పుష్కలంగా ఉన్నందున కండరాలు, రక్తనాళాలు బలోపేతం అవుతాయి. రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది.

* ప్లమ్‌ పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి తినేవారిలో రక్తం గడ్డ కట్టదు. అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ.

* తీపి తిన్నప్పుడల్లా మధుమేహం వస్తుందేమోనని మనందరిలో ఎంతోకొంత భయం దాగే ఉంటుంది కదూ! ఆ భయాన్ని తరిమికొడతాయి అల్‌బుకారా పండ్లు. ఇవి మధుమేహాన్ని దరిచేరనివ్వవు.

* వీటిలోని జింక్‌ గాయాలను త్వరగా మాన్పితే, ఇ-విటమిన్‌ కళ్ల కింద నల్లచారలను ఇట్టే పోగొడుతుంది.

* ఇవి కడుపునొప్పి తగ్గిస్తాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో హాని చేసే సూక్ష్మక్రిములను బయటకు పంపేస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్‌లను నిరోధిస్తాయని ఇటీవలి పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

* బరువు తగ్గాలనుకున్నవారు ఈ పండ్లను తగిన మోతాదులో తింటే చాలట. ఈ సంగతి లివర్‌పూల్‌ విశ్వవిద్యాలయం తేల్చింది. పన్నెండు వారాల్లో బరువు తగ్గినట్టు ఆ అధ్యయనం నిరూపించింది.

* డి-విటమిన్‌, క్యాల్షియం వృద్ధి చెంది ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉంటాయి. మలబద్ధక సమస్య నుంచి బయటపడొచ్చు.

* అల్జీమర్స్‌ బారిన పడకుండా కాపాడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని