కర్రతో కసరత్తులు

బరువు తగ్గడం ఒక ఎత్తు... పొట్టను తగ్గించుకోవడం మరో ఎత్తు. పొట్టకు ఇరువైపులా ఉన్న కొవ్వుని కరిగించుకోవడానికి కర్రతో సులువుగా చేసే ఈ వ్యాయామాలు కొంత ఉపయోగపడతాయి.

Updated : 19 Dec 2022 01:53 IST

బరువు తగ్గడం ఒక ఎత్తు... పొట్టను తగ్గించుకోవడం మరో ఎత్తు. పొట్టకు ఇరువైపులా ఉన్న కొవ్వుని కరిగించుకోవడానికి కర్రతో సులువుగా చేసే ఈ వ్యాయామాలు కొంత ఉపయోగపడతాయి. ఒక్కో వ్యాయామాన్ని పది నుంచి ఇరవై సార్లు మార్చి మార్చి చేయగలిగితే మంచిది. అవెలా చేయాలంటే...

* ముందుగా కర్రను నేలకు ఆనించి నిటారుగా నిల్చోవాలి. చేతులు మారుస్తూ కుడికాలిని ఎడమ వైపు, ఎడమ కాలిని కుడివైపు వీలైనంత ఎత్తు లేపాలి. దీనివల్ల పొట్ట, నడుము చుట్టూ ఉండే కొవ్వు కరగడంతో పాటు కాళ్లకూ చక్కటి వ్యాయామం.

* రెండు చేతులతో కర్రను పట్టుకుని భుజాలపై ఉంచాలి. దీన్ని పైకెత్తి, వీలైనంత వెనక్కి తీసుకు వెళ్లాలి. చేతుల్ని మళ్లీ ముందుకు తీసుకురావాలి.  

* కర్రను భుజాలపై ఉంచి.. చేతులతో పట్టుకుని రెండువైపులా వీలైనంత వంగేందుకు ప్రయత్నించాలి. ఆ తరువాత కుడి, ఎడమవైపు తిరగాలి.

* రెండు చేతులతో కర్రను పట్టుకుని పైకెత్తాలి. కాళ్లను కాస్త ఎడంగా ఉంచి, మోకాళ్లను వంచకుండా కర్రతో సహా ముందుకు వంగి, పైకిలేవాలి. ఆ సమయంలో పొట్ట లోపలికి ఉండేలా చూసుకోవాలి. దీంతో పొట్ట కండరాలు దృఢంగా మారతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్