ఒత్తిడి తగ్గించే కరివేపాకు టీ!

తరచూ టీ తాగితే ఒంటికి మంచిది కాదు. కానీ, రోజుకొక్కసారైనా ఈ కరివేపాకు ఛాయ్‌ తాగితే మాత్రం రుచితో పాటూ ఆరోగ్యమూ... అదెలాగంటారా? గుప్పెడు కరివేపాకుల్ని కడిగి నీళ్లలో వేసి మరిగించండి. ఆపై వడకట్టి కాస్త పటిక బెల్లం వేసుకుని తాగి చూడండి. ఆ ఆకుల సువాసన నరాలను రిలాక్స్‌ చేస్తుంది.

Published : 27 Feb 2023 00:13 IST

తరచూ టీ తాగితే ఒంటికి మంచిది కాదు. కానీ, రోజుకొక్కసారైనా ఈ కరివేపాకు ఛాయ్‌ తాగితే మాత్రం రుచితో పాటూ ఆరోగ్యమూ... అదెలాగంటారా?

గుప్పెడు కరివేపాకుల్ని కడిగి నీళ్లలో వేసి మరిగించండి. ఆపై వడకట్టి కాస్త పటిక బెల్లం వేసుకుని తాగి చూడండి. ఆ ఆకుల సువాసన నరాలను రిలాక్స్‌ చేస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు,  కరివేపాకులో ఫినోలిక్స్‌ అనే యాంటీ ఆసిడ్‌ చర్మ వ్యాధులను నయం చేస్తుంది.

కరివేపాకు చాయ్‌ రోజూ తాగితే ఇందులోని విటమిన్లూ, ఖనిజాలు కంటి చూపుని మెరుగుపరుస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచి జుట్టు, చర్మాన్ని మెరిపిస్తాయి.

మధుమేహం ఉన్నవారు ఈ కరివేపాకు టీనిని తాగితే చాలు... షుగర్‌ లెవల్స్‌ను ఎంచక్కా సమన్వయం అవుతాయి.  

పని ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్లూ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఇబ్బందులతో బాధపడేవారు రోజూ వేడి వేడిగా ఈ చాయ్‌ని తాగితే సరి. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడమే కాదు..మెదడుకీ ఉపశమనం లభిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్