జలుబా.. వీటిని చేర్చేయండి!

ఎక్కడ చూసినా జలుబు, జ్వరం, దగ్గే! కరోనా తర్వాత వివిధ వైరస్‌ల దాడి పెరగడమే కారణం అంటున్నారు నిపుణులు. వీటి బారి నుంచి ఇంట్లో వాళ్లందరినీ సురక్షితంగా ఉంచడమెలా అని ఆలోచిస్తున్నారా? వీటిని రోజువారీ ఆహారంలో చేర్చండి.

Published : 17 Mar 2023 00:07 IST

ఎక్కడ చూసినా జలుబు, జ్వరం, దగ్గే! కరోనా తర్వాత వివిధ వైరస్‌ల దాడి పెరగడమే కారణం అంటున్నారు నిపుణులు. వీటి బారి నుంచి ఇంట్లో వాళ్లందరినీ సురక్షితంగా ఉంచడమెలా అని ఆలోచిస్తున్నారా? వీటిని రోజువారీ ఆహారంలో చేర్చండి.


పసుపు

దీనిలో ఉండే కర్క్యుమిన్‌కి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలెక్కువ. ఇవి రోగనిరోధకతను పెంచడంలో సాయపడతాయి. ఫ్లూ లక్షణాలు కనిపిస్తోంటే దీని వాడకం పెంచాలి. పాలు, వేడి ద్రవపదార్థాల్లోనూ పసుపుతోపాటు కొద్దిగా మిరియాలపొడినీ కలిపి ఇస్తే మంచిది.


అల్లం

ఫ్లూ/ జలుబును దూరంగా ఉంచడమే కాదు జీర్ణశక్తినీ మెరుగుపరచగలదు. నీటిలో వేసి మరిగించి వడకట్టి తాగొచ్చు. లేదూ టీ, సూపుల్లో భాగం చేసుకొని తీసుకున్నా ఉపశమనం ఉంటుంది.


వెల్లుల్లి

దీనిలో యాంటీ వైరల్‌, మైక్రోబియల్‌ గుణాలెక్కువ. రోగనిరోధకతను పెంచుతూనే ఫ్లూ/ జలుబుకు వ్యతిరేకం గానూ పనిచేస్తుంది. రోజువారీ ఆహారంలో దీన్ని భాగం చేసుకుంటే ఇతర ఇన్ఫెక్షన్ల నుంచీ తప్పించుకోవచ్చు.


విటమిన్‌ సి

రోగనిరోధకతను పెంచడంలో ఈ విటమిన్‌ సాయపడుతుంది. క్యాప్సికం, నారింజ, కివీ, బత్తాయి, నిమ్మ మొదలైన వాటిల్లో ఇది మెండుగా ఉంటుంది. ఇది తరచూ శరీరానికి అందేలా చూసుకుంటే శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్