పుచ్చ గింజలు పడేస్తున్నారా?
ఈ కాలం ఎక్కువ దొరికే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఎండవేడికి చల్లచల్లగా తింటోంటే ఉండే మజానే వేరు! అయితే పండు తిన్నాక గింజలు పడేస్తున్నారా? వాటిల్లోనూ బోలెడు పోషకా లుంటాయని తెలిస్తే.. ఇకపై పడేయరు.. అవేంటో చూడండి..
ఈ కాలం ఎక్కువ దొరికే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఎండవేడికి చల్లచల్లగా తింటోంటే ఉండే మజానే వేరు! అయితే పండు తిన్నాక గింజలు పడేస్తున్నారా? వాటిల్లోనూ బోలెడు పోషకా లుంటాయని తెలిస్తే.. ఇకపై పడేయరు.. అవేంటో చూడండి..
పుచ్చ గింజల్లో గుండె ఆరోగ్యానికీ, రక్తపోటు తగ్గించడానికీ అవసరమైన మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. జింక్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో ఈ కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ దొరుకుతుంది. క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడంలో సాయపడుతుంది.
* ఫైబర్, అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. పుచ్చగింజల్లో ప్రొటీన్, ఫ్యాటీ యాసిడ్లు అధికం. ఇవి చర్మ, కేశ ఆరోగ్యాన్ని రక్షించడమే కాదు ఇన్‌ఫ్లమేషన్, యాక్నేలనీ దూరంగా ఉంచుతాయి.
ఎలా తినాలి?.. విత్తనాలను నూనె లేకుండా బాణలిలో వేసి వేయిస్తే పొట్టు సులువుగా వచ్చేస్తుంది.. నేరుగా తినేయొచ్చు. అలా కుదరడం లేదనిపిస్తే వలిచిన విత్తనాలను పొడి చేసి, స్వీట్లు, పాలల్లో వేసుకొని తాగినా మంచిదే. రోజుకు పావు కప్పు వరకూ తీసుకోవచ్చనేది నిపుణుల సలహా!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.