కడుపులో మంటను తగ్గించండిలా..
ఉదయాన్నే పనిలో పడి అల్పాహారం ఆలస్యంగా తినడం.. మధ్యాహ్నం ఆఫీసులో వీలు పడక భోజనం ఆలస్యం.. ఇక రాత్రి ఐతే చెప్పనక్కర్లేదు! అందరూ తిన్న తర్వాత కానీ మనకు తినడం కుదరదు. మామూలుగానే మనకు హార్మోనుల్లో అసమానతల వల్ల అప్పుడప్పుడూ అజీర్తి, గ్యాస్ వంటివి సాధారణమే!
ఉదయాన్నే పనిలో పడి అల్పాహారం ఆలస్యంగా తినడం.. మధ్యాహ్నం ఆఫీసులో వీలు పడక భోజనం ఆలస్యం.. ఇక రాత్రి ఐతే చెప్పనక్కర్లేదు! అందరూ తిన్న తర్వాత కానీ మనకు తినడం కుదరదు. మామూలుగానే మనకు హార్మోనుల్లో అసమానతల వల్ల అప్పుడప్పుడూ అజీర్తి, గ్యాస్ వంటివి సాధారణమే! ఇలా ఆహార వేళలనీ పాటించకపోతే అవి తీవ్రమై కడుపులో మంట వంటివి పెరిగిపోతాయి. వాటిపై దృష్టి పెట్టాల్సిందేనంటున్నారు నిపుణులు..
* నిద్రకు ఉపక్రమించడానికి కనీసం రెండు గంటల ముందు ఆహారం తీసుకోవాలి. అప్పుడే అది తేలికగా జీర్ణమవుతుంది. మసాలాలు, జంక్‌ఫుడ్ వంటివి రాత్రి సమయంలో తినకపోవడమే మేలు. కూల్‌డ్రింక్స్, సోడాల్లాంటివీ గ్యాస్‌ను పెంచుతాయి. వాటికీ దూరంగా ఉండాలి. ఒకవేళ తినగానే నిద్రపోవాల్సి వస్తే కుడివైపునకు మాత్రమే తిరిగి పడుకోండి. ఎడమ వైపు పడుకోవటం వల్ల జీర్ణవ్యవస్థకు అవసరమైన ఆమ్లాలు అన్నవాహికలోకి ప్రవేశించవు. అప్పుడు ఆహారం జీర్ణమవ్వక గ్యాస్ సమస్య బాధిస్తుంది.
* అరటిపండు జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. దీని ద్వారా పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. కడుపులో శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది అదనపు యాసిడ్ తయారవకుండా ఆపుతుంది. భోజనం తర్వాత దీన్ని తీసుకోవడం అలవాటు చేసుకున్నా మంచిదే!
* చల్లటి మజ్జిగ ఎసిడిటీకి విరుగుడులాగా పనిచేస్తుంది. మజ్జిగలోని లాక్టిక్ ఆమ్లం కడుపులోని యాసిడ్‌లను సరైన స్థాయుల్లో ఉంచుతుంది. దీంట్లో ఉండే ప్రోబయాటిక్స్ కడుపుబ్బరాన్ని తగ్గిస్తాయి. తేనె, నిమ్మరసం వేసుకొని అల్లం టీ తాగినా గ్యాస్ట్రిక్ సమస్య అదుపులోకి వస్తుంది. అల్లం వికారాన్ని తగ్గించి ఆహారం తేలిగ్గా జీర్ణమవ్వటానికి ఉపయోగపడుతుంది. వీటితో పాటు రోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవటం శరీరానికి అలవాటు చేయాలి. అప్పుడు సమస్య శాశ్వతంగా దూరమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.