ప్లాస్టిక్‌ సురక్షితమేనా?

ప్లాస్టిక్‌ వస్తువులను వాడుతున్నారా? రకరకాల ఆకృతుల్లో, కంటికి ఇంపుగా అందాన్ని ఇస్తున్నాయని ఈ వస్తువులను వాడుతున్నాం. కానీ వీటి వల్ల దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

Published : 27 Apr 2023 00:09 IST

ప్లాస్టిక్‌ వస్తువులను వాడుతున్నారా? రకరకాల ఆకృతుల్లో, కంటికి ఇంపుగా అందాన్ని ఇస్తున్నాయని ఈ వస్తువులను వాడుతున్నాం. కానీ వీటి వల్ల దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

వీటిని ఎంచుకోండి... వేడి పదార్థాలను ప్లాస్టిక్‌ డబ్బాల్లో వేయడం శ్రేయస్కరం కాదు. మనకు తెలిసినా కంగారులోనో, ప్రత్యామ్నాయాలు లేకనో వేసేస్తుంటాం. దాని వల్ల ఇప్పుడు ముప్పులేకపోయినా భవిష్యత్తులో క్యాన్సర్‌, ఎండోక్రైన్‌ సమస్యలకు దారితీస్తుంది. అందుకే లంచ్‌, టిఫిన్‌ బాక్సులు సిరామిక్‌ లేదా స్టీల్‌వి వాడటం మంచిది.

కుదరనప్పుడు చల్లార్చండి... పిల్లలు రంగులకు, ఆకృతులకు ఎక్కువగా ఆకర్షితులవుతారు. వారికి స్టీల్‌ డబ్బాలు నచ్చవు. అలాంటప్పుడు ప్యాకింగ్‌ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార పదార్థాలను చల్లార్చిన తర్వాతే ప్యాక్‌ చేయాలి.

వేడికి దూరంగా... ప్లాస్టిక్‌ సీసాలు, డబ్బాలు ఎండకి ఎంత దూరంగా ఉంచితే అంతమంచిది. ఇవి ఎండకి ప్రభావితమై విష రసాయనాలను విడుదల చేస్తాయి. చెక్కతో చేసి లోపల సెరామిక్‌ కోటింగ్‌ ఉన్న లంచ్‌ బాక్సులు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి వాటిని వాడితే ఆరోగ్యానికి ఆరోగ్యం, పర్యావరణానికి రక్షణగానూ ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని