నిరంతరం నాజూగ్గా..

అమ్మాయిలంతా సన్నజాజి తీగలాగా ఉండేందుకే ఓటేస్తున్నారు.. నోరు కట్టుకొని మరీ బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. తర్వాత అదే బరువును కొనసాగించడంలో మాత్రం కేవలం 20శాతం మందే విజయవంతమవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

Published : 06 May 2023 00:23 IST

అమ్మాయిలంతా సన్నజాజి తీగలాగా ఉండేందుకే ఓటేస్తున్నారు.. నోరు కట్టుకొని మరీ బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. తర్వాత అదే బరువును కొనసాగించడంలో మాత్రం కేవలం 20శాతం మందే విజయవంతమవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాకాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు చెబుతున్నారు నిపుణులు..

తక్కువగా.. తినే ప్రతిసారీ మీ శరీరాన్ని దృష్టిలో ఉంచుకోండి. భోజనం ప్లేటుని చిన్నగా ఉండేలా చూసుకోవాలి. చిన్న దాంట్లో అయితే తక్కువగా పెట్టుకున్నా.. ఎక్కువ మొత్తంలో కనిపిస్తాయి. టీవీ, ఫోన్‌లు కట్టేసి, ఆహారంపై ధ్యాస పెట్టాలి.

నియమం.. చాలా కాలం డైటింగ్‌ చేసి ఇష్టమైన పదార్థాలన్నింటినీ దూరం పెట్టి ఉంటారు. ఒక సారి మీ లక్ష్యాన్ని చేరగానే.. ఇక దానిపై దృష్టి తగ్గిపోతుంది. ఒక్కసారే ప్రీతికరమైనవన్నీ తింటే మళ్లీ బరువు పెరుగుతారు. వారానికి ఒకసారే అలా తినాలనే నియమం పెట్టుకోవాలి. దాన్ని తు.చ. తప్పక అనుసరించాలి.

ఏడుకు ముందే.. రాత్రిళ్లు పనిలో పడో, ఇంట్లో వాళ్లందరికీ వడ్డిస్తూనో.. మనందరికీ ఆలస్యంగా భోజనం చేయటం అలవాటు. అది బరువు పెరిగేందుకు ప్రధాన కారణమని మీకు తెలుసా.. తిన్న ఆహారం జీర్ణమవ్వడానికి సమయం పడుతుంది. తినగానే నిద్రకు ఉపక్రమిస్తే అది కొవ్వు రూపంలో శరీరంలో పేరుకుపోతుంది. అందువల్ల రాత్రి ఏడుగంటల లోపే భోజనం చేయాలి.

క్రమం తప్పకుండా.. ఎలాగూ బరువు తగ్గాం కదా.. ఇంక వ్యాయామం ఆపేద్దాం అనుకుంటాం.. అది మంచి పద్ధతి కాదు. ఉన్నట్టుండి ఒక్కసారే మళ్లీ బరువు పెరుగుతాం. కాబట్టి క్రమం తప్పక వ్యాయామం చేయాలి. చిరుతిళ్లు తినాలనే కోరిక సహజమే.. బదులుగా పండ్లు, నట్స్‌, డార్క్‌ చాక్లెట్లు వంటి వాటిని తీసుకోవచ్చు..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని