ఈ పొరపాట్లు చేస్తున్నారా..

ఈ కాలం పిల్లల్లో అసలు సహనమే ఉండట్లేదు..  తలచిన వెంటనే పని జరిగిపోవాలనుకునేవారే ఎక్కువ. బరువు తగ్గాలిన నిర్ణయించుకున్నదే తడవుగా రాత్రి, పగలూ అదేపనిలో ఉంటారీ అమ్మాయిలు.

Published : 09 May 2023 00:27 IST

ఈ కాలం పిల్లల్లో అసలు సహనమే ఉండట్లేదు..  తలచిన వెంటనే పని జరిగిపోవాలనుకునేవారే ఎక్కువ. బరువు తగ్గాలిన నిర్ణయించుకున్నదే తడవుగా రాత్రి, పగలూ అదేపనిలో ఉంటారీ అమ్మాయిలు. ఈ పద్ధతి మంచిది కాదు. వీటితో అనేక అనారోగ్య సమస్యలు దాపురిస్తాయంటున్నారు నిపుణులు...

* వెంటనే జిమ్‌లో చేరి వేగంగా బరువు తగ్గాలనే సంకల్పంతో వారి శక్తికి మించిన బరువులెత్తడం, వ్యాయామం లాంటివి చేస్తుంటారు. దాంతో పాటు ఆహారం కూడా ఒకేసారి తగ్గిస్తారు. కొవ్వుపదార్థాలు, చక్కెరలు ఉన్నట్టుండి తగ్గించటం వల్ల నిస్సత్తువ, కళ్లు తిరగటం వంటివి జరుగుతాయి. అలాకాకుండా మొదట చిన్న చిన్న వ్యాయామాలతో మొదలు పెట్టాలి. ఆహారాన్ని కూడా పూర్తిగా తగ్గించకుండా పోషకాలు ఎక్కువగా ఉండే తాజా కూరగాయలు తినాలి.

* ప్రారంభంలో ఎక్కువ అలసిపోయే వ్యాయామాలు కాకుండా వాకింగ్‌, రన్నింగ్‌ వంటివి ఎంచుకోవాలి. బరువు తగ్గేందుకు శరీరంతో పాటు మనసును కూడా సిద్ధం చేయాలి. రోజూ వ్యాయామంతో పాటు ధ్యానం కూడా చేయాలి. అప్పుడే మనసు ఆహారంపైకి మళ్లకుండా అధీనంలో ఉంటుంది.

* నిపుణులు, వైద్యుల సలహా లేకుండా మీ అంతట మీరు ఇంత బరువు తగ్గేద్దాం అని నిర్ణయించుకుంటారు. ఇంట్లో పెద్దవాళ్లు చెప్పినా వినరు. ఆ ధోరణి మార్చుకొని వైద్యుల సలహా మేరకు మీ వయసు, ఎత్తుకు తగ్గ బరువుని నిర్దేశించుకోండి. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు వేసుకుని నెమ్మదిగా దాన్ని అమలుచేయండి. కచ్చితంగా మీరు కోరుకున్న ఫలితం అందుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్