గోళ్లు సురక్షితంగా ఉంచుకోండిలా

మనకు నీటితోనే పనెక్కువ. సబ్బులు, లిక్విడ్‌ల రూపంలో రసాయనాలు గోళ్ల్లలోకి చొచ్చుకుపోవడం వల్ల రంగు మారడం, పుచ్చిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించాలంటే...

Published : 01 Jun 2023 00:19 IST

మనకు నీటితోనే పనెక్కువ. సబ్బులు, లిక్విడ్‌ల రూపంలో రసాయనాలు గోళ్ల్లలోకి చొచ్చుకుపోవడం వల్ల రంగు మారడం, పుచ్చిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించాలంటే...

* అందం కోసం వేసిన రంగులవల్ల గోళ్లు పుచ్చిపోయే ప్రమాదం ఉంది. కొంతమంది రెండు రోజులకోసారి వేస్తుంటారు. దీనివల్ల రసాయనాల మోతాదు మరీ ఎక్కువవుతుంది. అందుకే రెండుమూడు వారాలకోసారి మాత్రమే రంగులు మార్చాలి.

* వెల్లుల్లిలోని సెలీనియం.. గోళ్లు ఆరోగ్యంగా పెరగడానికి సాయపడుతుంది. వెల్లుల్లి నూనెనూ గోళ్లకు అప్లై చేయొచ్చు. 

* తేనె.. గోళ్లలో బ్యాక్ట్టీరియా, శిలీంధ్రాల పెరుగుదలను నియంత్రిస్తుంది. నిమ్మరసంలో తేనెను కలిపి రాస్తే చక్కని పోషణ అందుతుంది. 

* ఒక గిన్నెలో సమపాళ్లలో ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌, వేడి నీళ్లను తీసుకుని వాటిలో గోళ్లను 10 నిమిషాలు నానబెడితే ఫంగస్‌ సమస్యలు రావు.  వారానికి రెండుసార్లు ఇలా చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్