కొంచెమైన చాలు! కొత్తిమీర

కూర ఏదైనా కాస్త కొత్తిమీర చల్లితే చాలు. ఆ ఘుమఘుమలు తినాలన్న కోరికను పెంచేస్తాయి. రుచిని రెట్టింపు చేస్తాయి. అంతే కాదండోయ్‌ పోషకాలూ పుష్కలమే...

Updated : 21 Jul 2023 05:18 IST

కూర ఏదైనా కాస్త కొత్తిమీర చల్లితే చాలు. ఆ ఘుమఘుమలు తినాలన్న కోరికను పెంచేస్తాయి. రుచిని రెట్టింపు చేస్తాయి. అంతే కాదండోయ్‌ పోషకాలూ పుష్కలమే...

ఒత్తిడో, వంశపారంపర్యమో!..బీపీ భయపెడుతుంటే మీ వంటకాల్లో కొత్తిమీరను చేర్చుకోండి. సలాడ్లలో కాస్తైనా చల్లి తినండి. ఇందులోని పోషకాలు రక్తపోటుని అదుపు చేస్తాయి. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం వంటివి వచ్చే రిస్క్‌ తగ్గుతుంది.

 కంటి చూపు మందగిస్తుంటే... కొత్తిమీరతో చేసిన వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇందులోని విటమిన్‌ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు, ఫాస్ఫరస్‌ వంటివి దృష్టిదోషాల్ని తగ్గిస్తాయి. కంటిమీద ఒత్తిడిని నియంత్రిస్తాయి. అలానే ఇందులోని బీటాకెరటిన్‌ వయసు పెరగడం వల్ల ఎదురయ్యే కంటి సమస్యల్ని అదుపు చేస్తుంది. 

 వికారానికీ, అజీర్తి సమస్యలకీ కొత్తిమీర మంచి విరుగుడు. ఇందులో ఉండే ఫైబర్‌ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దీనిలోని యాంటీ సెప్టిక్‌ లక్షణాలు నోటి పుండ్లను నిరోధిస్తాయి. ఎముక బలానికి అవసరమైన మినరల్స్‌, క్యాల్షియం ఇందులో పుష్కలంగా ఉంటాయి. హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులూ తగ్గుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్