ఆ విలువలనే అందించా..
భారతీయ మహిళలం ఇల్లు, జీవితం, పని, ఇలా చాలా విషయాల్ని నిత్యం సమన్వయం చేస్తుంటాం. రబ్బరు బంతిని క్యాచ్ పట్టుకోవడం మిస్ అయినా బౌన్స్ అవుతున్నప్పుడు తిరిగి పట్టుకోవచ్చు. అదే గాజు బంతి అయితే... ఒకసారి
భారతీయ మహిళలం ఇల్లు, జీవితం, పని, ఇలా చాలా విషయాల్ని నిత్యం సమన్వయం చేస్తుంటాం. రబ్బరు బంతిని క్యాచ్ పట్టుకోవడం మిస్ అయినా బౌన్స్ అవుతున్నప్పుడు తిరిగి పట్టుకోవచ్చు. అదే గాజు బంతి అయితే... ఒకసారి పట్టుకోలేకపోయామా.. పగిలి పోతుంది. అందుకే ఏ పని ఎప్పుడెలా చేయాలి, ఎలా సమన్వయం చేయాలి... దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలనేది గుర్తించగలగాలి. అవగాహనతో దేన్నీ చేజారిపోకుండా చూసుకోగలగాలి. తల్లిగా పిల్లలకు మనం మంచి ఉదాహరణగా నిలవడానికి కృషి చేయాలి. మా చిన్నబ్బాయి అనంత్ అధిక బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే నేను ముందుగా బరువు తగ్గి, తనకు మార్గదర్శకురాలినయ్యా. పిల్లలకు మనం స్ఫూర్తిగా మారగలిగితే చాలు. మనల్ని వాళ్లు అనుసరిస్తారు. మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాను నేను. అక్కడ అబ్బిన జీవిత విలువలు ఎప్పుడూ నా వెన్నంటే ఉంటాయి. మనం ఏ స్థాయికెదిగినా మన విలువలను వీడ కూడదనేది నా అభిప్రాయం. పెళ్లైన ఎనిమిదేళ్లకు మాకు పిల్లలు పుట్టారు. అలాగని వారిని గారాబం చేయలేదు. నేను నమ్మిన విలువలనే వారికీ నూరిపోస్తూ పెంచా. మావారు ముఖేశ్ కూడా రోజుకి 18 గంటలు పనిచేసి ఇంటికి వచ్చినా, విసుగు లేకుండా పిల్లలకు హోంవర్క్‌లో సాయం చేసేవారు. అలాగే భార్యగా ముఖేశ్‌కు ప్రేమను పంచడంలో ముందుంటా. ఆయన ఎదుటపడిన ప్రతిసారీ చిరునవ్వుతో సంతోషంగా కనిపిస్తా. రోజంతా కష్టపడి ఇంటికి చేరుకునే మగవాళ్లు భార్యని చిరుబుర్రులాడుతూ చూడాలనుకోరు. ప్రశాంతంగా కనిపించే భార్య ముఖం ఏ భర్తకైనా పడిన కష్టాన్నంతా మరిపిస్తుంది. ముఖేశ్ నన్ను ప్రేమగా ట్రూ లైఫ్ పార్టనర్ అని పిలుచుకుంటారు. తన భార్యగా స్థానాన్ని పొందడాన్ని సంతోషంగా భావిస్తాను.
- నీతా అంబానీ, ఛైర్‌పర్సన్, రిలయన్స్ ఫౌండేషన్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.