పిల్లలు పడకుండా!

బుజ్జాయిలు బుడి బుడి అడుగులు వేస్తుంటే... ముచ్చటగా ఉంటుంది. అదే సమయంలో ఒకింత జాగ్రత్తగానూ ఉండాలి. లేదంటే అపాయాల బారిన పడాల్సి వస్తుంది.

Updated : 06 Jan 2023 06:10 IST

బుజ్జాయిలు బుడి బుడి అడుగులు వేస్తుంటే... ముచ్చటగా ఉంటుంది. అదే సమయంలో ఒకింత జాగ్రత్తగానూ ఉండాలి. లేదంటే అపాయాల బారిన పడాల్సి వస్తుంది. ఇందుకోసం ఏం చేయాలంటే...

* పసిపిల్లలు తిరిగే చోట.... పదునైన, ప్రమాదకర వస్తువులేవీ లేకుండా చూసుకోండి. అల్మారాలూ, మంచం కొనలు పదును తేలి ఉంటే... సింథటిక్‌ హోల్డర్స్‌ వస్తున్నాయి మార్కెట్‌లో వాటిని పెట్టండి. బీరువాలు, గాలి ఆడని ప్రదేశాలూ ఉంటే కచ్చితంగా లాక్‌ చేయండి. పొరపాటున వారిని గమనించుకోకపోతే... చిక్కుల్లో పడాలి.

*  పిల్లలు పాకుతున్నప్పుడైనా, తప్పటడుగులు వేస్తున్నప్పుడైనా తరచూ దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు. ఈ పరిస్థితి రాకుండా మార్కెట్‌లో దొరికే ఫోమ్‌ మ్యాట్‌లను నేలపై పరిస్తే సరి. పడినా గాయాలు కావు. 

*  పై అంతస్థుల్లో ఉండేవారూ, చిన్నారులూ కిందకి రాకుండా బాల్కనీ గ్రిల్స్‌, మెట్ల మధ్య సందులకు తప్పనిసరిగా మెష్‌ ఏర్పాటు చేసుకోవాలి. ఓ చిన్నపాటి గేట్‌నీ పెట్టించుకోవాలి. అయితే ఓ చోట నుంచి వారు కదలకుండా ఉండటానికి బేబీ గేట్స్‌ మార్కెట్‌లో దొరుకుతున్నాయి. వీటిని వాడి చూడండి. వారికోసం పరుగులు పెట్టాల్సిన పని ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్