ఆనందాన్ని పండిద్దామా!...

ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు. అలా ఉండాలంటే ముందు మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. అదెలానో చూద్దామా!

Published : 05 Apr 2023 00:03 IST

ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు. అలా ఉండాలంటే ముందు మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. అదెలానో చూద్దామా!

ఆశావాదం అలవరచుకుంటే..

ఏ విషయంలోనైనా చెడును వెతకడం తేలికే. కానీ అదే అలవాటయితే మాత్రం కష్టం. ప్రతి విషయంలోనూ మంచిని చూడాలి. అలా అని వాస్తవాన్ని వదిలేయమని కాదు. పదే పదే ప్రతికూల విషయాలు తవ్వుకుంటూ ఉంటే అనవసరపు ఆందోళనే తప్ప ఏ ప్రయోజనం ఉండదు.

కృతజ్ఞతాభావంతో..

చేసిన మేలు మరచిపోకూడదంటారు. మనకు ఎదుటివారు చేసిన సహాయం చిన్నదైనా , పెద్దదైనా సరే కృతజ్ఞతలు చెప్పడం మరవద్దు. ఆ భావన మనకు సంతోషాన్నిచ్చి శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుందట. అంతేకాదు ప్రతి రోజూ మనకు జరిగిన మంచిని, సాయం చేసిన వాళ్లను, ఆ అనుభవాలను గుర్తుకుతెచ్చుకుంటూ ఉంటే మరింత ఆనందంగా ఉంటామట. గతంలో మనం ఎదుర్కొన్న కొన్ని బాధాకర పరిస్థితులూ గుణపాఠాలు నేర్పుతాయి. అందులోంచి ఎలా బయటపడ్డామో, ఆ తర్వాత ఎంత బలంగా తయారయ్యామో తలచుకుంటే మన పెదాలపై నవ్వులు పూస్తాయి.

బంధాలు బలపరచుకోవడంలో.

మనకు అత్యంత ఆనందాన్నిచ్చేవి బంధాలే. అది కుటుంబ సభ్యులు కావొచ్చు..స్నేహితులు అవ్వొచ్చు. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నారంటే తనకు అండగా నిలిచే కుటుంబీకులు ఉన్నారని అర్థం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అందరితో కలవలేకపోతాం. స్నేహితులనీ నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ సమయం కుదుర్చుకుని వాళ్లతో మాట్లాడాలి లేదా వెళ్లి కలవాలి. టీవీ, ఫోన్లు అంటూ మన పక్కనున్న వాళ్లతోనూ సరిగా మాట్లాడకుండా ఉండటం మనకు అలవాటైపోయింది. అది తప్పు. కాసేపు వాటిని పక్కన పెట్టి మనస్ఫూర్తిగా మాట్లాడితేనే వారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోగలం. అప్పుడే బంధాలూ బలపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్