డ్రోన్‌ తయారీలో ఆ నలుగురు

ప్రకృతి విపత్తులు, ప్రమాదాల్లో చిక్కుకుని, ఎవరూ గుర్తించలేకపోవడంతో కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఆ నలుగురు అమ్మాయిలను కలచివేశాయి. దానికి పరిష్కారం కనిపెట్టాలని భావించి ఓ ఆవిష్కరణ చేశారు.  వారెవరు, అదేంటో చదివేయండి.

Published : 05 Aug 2021 01:11 IST

ప్రకృతి విపత్తులు, ప్రమాదాల్లో చిక్కుకుని, ఎవరూ గుర్తించలేకపోవడంతో కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఆ నలుగురు అమ్మాయిలను కలచివేశాయి. దానికి పరిష్కారం కనిపెట్టాలని భావించి ఓ ఆవిష్కరణ చేశారు.  వారెవరు, అదేంటో చదివేయండి.
2018లో కేరళలో వరదలు ముంచెత్తాయి. అప్పుడు ఎందరో ప్రాణాలూ కోల్పోయారు. వారిలో ఎవరూ గుర్తించక చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ. అదే ఆ స్నేహితుల్ని బాధించింది. వారిని సకాలంలో కనిపెట్టగలిగి ఉంటే కొందరైనా ప్రాణాలతో బయట పడేవారు కదా అని బాధపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఓ పరిష్కారం చూపించాలనుకున్నారు. వారే త్రిశూర్‌ ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీ చివరి సంవత్సరం విద్యార్థినులు లక్ష్మి, శృతి, నందన, మనల్‌ జలీల్‌. కొన్నాళ్ల మథనం తర్వాత వాళ్ల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మార్గదర్శకత్వంలో ఓ డ్రోన్‌ తయారు చేశారు. ప్రమాదకర పరిస్థితుల్లో, ఎవరూ అడుగు పెట్టలేని ప్రాంతాల్లో చిక్కుకునే వారిని ఇట్టే గుర్తించగలిగే సాంకేతికత ఇందులో ఏర్పాటు చేశారు. భూమికి పది మీటర్ల ఎత్తులో ఎగురుతూ, సెకనుకు 15 మైళ్ల వేగంతో ఏకబిగిన రెండు కిలోమీటర్లు ప్రయాణించగలిగేలా రూపొందించారు. ఇది పావు గంటసేపు ఒకేచోట గాలిలో స్థిరంగానూ ఉండగలదు.‘ఈ డ్రోన్‌కు సాంకేతికత, ఆర్థిక సాయాన్ని ‘ద ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌’ అందించింది. కేరళలో జెన్‌స్కిల్‌ సంస్థ నిర్వహించిన పోటీల్లో 27 బృందాలు పాల్గొనగా వీరి బృందం విజేతగా నిలిచింది. దీన్ని కేవలం రూ.24వేలకే అందిస్తామనీ’ చెబుతోంది ఈ బృందం. భవిష్యత్తులో ప్రభుత్వ విభాగాలు వినియోగించేలా మా ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేస్తాం అని చెబుతోన్న ఈ అమ్మాయిల బృందం ఆలోచనా, కృషి స్ఫూర్తిదాయకం కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్