అబ్బాయిగా పుట్టుంటే బాగుండేది!

‘అమ్మాయిగా కాకుండా అబ్బాయిగా పుట్టుంటే బాగుండేది’.. ఈ మాటలు అన్నది ఓ సాధారణ అమ్మాయి కాదు. చైనాకు చెందిన అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడాకారిణి ఝెంగ్‌ క్విన్‌వెన్‌.

Published : 01 Jun 2022 01:11 IST

‘అమ్మాయిగా కాకుండా అబ్బాయిగా పుట్టుంటే బాగుండేది’.. ఈ మాటలు అన్నది ఓ సాధారణ అమ్మాయి కాదు. చైనాకు చెందిన అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడాకారిణి ఝెంగ్‌ క్విన్‌వెన్‌. ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ని గెలుచుకోవాలని ఎన్నో ఆశలతో కోర్టులో అడుగుపెట్టిన ఈ 19 ఏళ్ల అమ్మాయికి.. కష్టం ప్రత్యర్థి రూపంలో కాకుండా నెలసరి రూపంలో ఎదురయ్యింది. అవతల ఉన్నది ప్రపంచ నెంబర్‌ వన్‌ అని తెలిసి ఆత్మవిశ్వాసంతో తలపడి మొదటి రౌండులో ఆమెని మట్టి కరిపించింది ఝెంగ్‌. రెండో రౌండ్‌ నుంచి మొదలైన నెలసరి నొప్పి ఆమె సంకల్పాన్ని బలహీనం చేసింది. మరోపక్క గాయం. ‘గాయం కన్నా... నెలసరి నొప్పే నన్ను ఎక్కువగా బాధించింది. మొదటి రోజు ఎవరికైనా కష్టమే. కానీ ఎంత ప్రయత్నించినా, శరీర ధర్మాన్ని ఆ కష్టాన్ని ఎదురించలేకపోయాను. అదే అబ్బాయిగా పుట్టుంటే నాకీ కష్టం ఉండేది కాదుగా’ అంటూ బాధపడింది ఝెంగ్‌. నెలసరి సమయంలో క్రీడాకారిణులు ఎదుర్కొనే కష్టాన్ని ప్రపంచానికి ఇలా తెలియచేసింది ఝెంగ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్