తిరస్కరణను కూడా హుందాగా..

రాధిక స్నేహితుడు అకస్మాత్తుగా మాట్లాడటం మానేశాడు. అప్పటివరకు ప్రాణ స్నేహితుడినని చెప్పే అతను అలా దూరమయ్యేసరికి ఆమెకు ప్రపంచమంతా చీకటై, తనను తాను తిట్టుకోవడం మొదలుపెట్టింది. అలాకాకుండా ఎదుటివారి నుంచి వచ్చే తిరస్కరణనైనా హుందాగా స్వీకరించి, ముందుకు సాగాలంటున్నారు నిపుణులు.

Published : 08 Sep 2022 00:52 IST

రాధిక స్నేహితుడు అకస్మాత్తుగా మాట్లాడటం మానేశాడు. అప్పటివరకు ప్రాణ స్నేహితుడినని చెప్పే అతను అలా దూరమయ్యేసరికి ఆమెకు ప్రపంచమంతా చీకటై, తనను తాను తిట్టుకోవడం మొదలుపెట్టింది. అలాకాకుండా ఎదుటివారి నుంచి వచ్చే తిరస్కరణనైనా హుందాగా స్వీకరించి, ముందుకు సాగాలంటున్నారు నిపుణులు.

కరంటే మరొకరికి ప్రాణంగా ఉండేవారెందరో విడిపోతుంటారు. ఒకరికొకరు నీడలా మారినవాళ్లూ దూరమవుతుంటారు. స్నేహం లేదా ప్రేమ ఎందులోనైనా.. మానవ సంబంధాల్లో ఇవన్నీ సాధారణ విషయాలే అంటున్నారు నిపుణులు. అటువంటప్పుడే ధైర్యంగా ఉండాలి. న్యూనతకు గురికాకూడదు. కొందరు ఇటువంటి సందర్భంలో తమను తామే తక్కువగా భావించడం, ఆత్మనింద మొదలుపెడతారు. ఇది సరైనది కాదు. ఈ సమయంలోనే ఒత్తిడి, ఆందోళనకు లోనవ్వకుండా, ఆత్మబలాన్ని పెంచుకుంటూ ఎదుటివారి తిరస్కరణను స్వీకరించగలిగే స్థాయికి చేరుకోవాలి.

మనసుకు నచ్చినట్లు..

తిరస్కరణ అనుభవం నుంచి కొత్త పాఠాలు నేర్చుకోవాలి. మరోసారి ఆ పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఇకముందు జాగ్రత్తగా అడుగులేయాలి. అప్పటివరకు మీకే లక్ష్యమూ లేకపోతే కొత్త లక్ష్యాన్ని ఎంచుకోవాలి. దాన్ని సాధించాలనే పట్టుదల తెచ్చుకోవాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఉత్సాహపడాలి. మనసుకు నచ్చింది కూడా అప్పటివరకు చేయలేకపోతే, తిరిగి దాన్ని ప్రారంభించాలి. జీవితం చాలా విలువైంది. అందులో ఇటువంటి సందర్భాలు కూడా ఒక భాగం మాత్రమే అని గ్రహించాలి. ఒంటరిగా అయ్యామనే భావన నుంచి ఒంటరిగానైనా అనుకున్నది సాధించగలననే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే చాలు. ఎదుటివారి తిరస్కరణ కూడా మీ ఎదుగుదలకు కారణం కావొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్