పగటికలగా మిగిలిపోతుందనుకున్నా!

కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌.. తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి మహిళగా ఎంతో గర్వపడుతున్నా. వ్యోమగామి కావాలన్నది చిన్ననాటి కల.

Published : 20 Nov 2022 00:57 IST

 

అనుభవపాఠం

కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌.. తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి మహిళగా ఎంతో గర్వపడుతున్నా. వ్యోమగామి కావాలన్నది చిన్ననాటి కల. చిన్నప్పుడు తాతగారి ఊరైన చీరాలలో ఉండేవాళ్లం. అక్కడ వేసవి రాత్రుల్లో ఆరుబయట పడుకుని, ఆకాశంలో నక్షత్రాలను చూస్తుంటే అక్కడకు వెళ్లి చూడాలన్న కుతూహలం కలిగేది. అమెరికా వెళ్లాక.. చదువుతూనే నా లక్ష్య సాధనకు ఏం చేయాలో తెలుసుకునేదాన్ని. సైన్స్‌ ఫిక్షన్‌, వ్యోమగాముల రచనల్ని బాగా చదివేదాన్ని. కల్పనా చావ్లాని ఆదర్శంగా తీసుకున్నా. మేముండే హ్యూస్టన్‌లో స్పేస్‌స్టేషన్‌కీ తరచూ వెళ్లేదాన్ని. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదివా. ‘నాసా’లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే కంటిచూపు సరిపోక అవకాశాన్ని కోల్పోయా. ఇన్నేళ్ల కల పగటికలగా మిగిలిపోతుందా అని మొదట దిగులు పడ్డా.. వెంటనే ఆ ఆలోచనల్ని దూరం పెట్టి ఇతర మార్గాల్ని అన్వేషించా. అప్పుడే ప్రైవేటు సంస్థ ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ ప్రారంభించారు. అందులో ఏరోనాటికల్‌ ఇంజినీర్‌గా, పరిశోధకురాలిగా కెరియర్‌ మొదలుపెట్టా. గతేడాది అంతరిక్షంలోకి వెళ్లొచ్చి నా కల నిజం చేసుకున్నా. అక్కణ్నుంచి రాగానే నా కల నిజమైందన్న సంగతి కన్నా, మళ్లీ ఎప్పుడు వెళ్తానా అన్నదే మనసులో మెదిలింది.  ప్రస్తుతం స్పేస్‌లో మొక్కల పెంపకంపైనా పరిశోధనలు చేస్తున్నా. ఒక మార్గం మూసుకుపోయినా, మరో దారిని ఆన్వేషిస్తూ ముందుకు సాగితే విజయం మీదే. దానికి నేనే నిదర్శనం. 

- శిరీష బండ్ల, వ్యోమగామి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని