సర్జికల్‌ స్టీల్‌ ప్రయత్నించారా?

ఇంట్లో ఎక్కువశాతం స్టీలు పాత్రల్ని ఉపయోగించినా..నాన్‌స్టిక్‌, రాగి, కంచు, అల్యూమినియం పాత్రల్లోనూ వంట చేస్తుంటాం. కానీ వాటన్నింటినీ పక్కకు నెట్టేసి సర్జికల్‌ స్టీల్‌ వెలిగిపోతోంది. ఇప్పుడిదే బెస్ట్‌ అంటున్నారు. ఎందుకో, ఏమిటో చూద్దాం...

Published : 05 Dec 2021 01:33 IST

ఇంట్లో ఎక్కువశాతం స్టీలు పాత్రల్ని ఉపయోగించినా..నాన్‌స్టిక్‌, రాగి, కంచు, అల్యూమినియం పాత్రల్లోనూ వంట చేస్తుంటాం. కానీ వాటన్నింటినీ పక్కకు నెట్టేసి సర్జికల్‌ స్టీల్‌ వెలిగిపోతోంది. ఇప్పుడిదే బెస్ట్‌ అంటున్నారు. ఎందుకో, ఏమిటో చూద్దాం...

ర్జికల్‌ స్టీల్‌ పాత్రల్లో పదార్థాలు ఆవిరి మీద, అతి తక్కువ నీటితో ఉడుకుతాయి కనుక విటమిన్లు, మినరల్సు వృథా కావు. సంపూర్ణ పోషకాహారం తినగల్గుతాం. ఈ పాత్రల్లో బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు చేరవు. క్షయింపచేసే, అరిగిపోయే గుణాలు వీటిల్లో లేవు.

* నూనె వేడయ్యేకొద్దీ విషతుల్యమవుతుంది. కానీ ఈ పాత్రల్లో తక్కువ సెగతో, త్వరగా వంట పూర్తవుతుంది. ఆరోగ్యదాయకం, రోగనిరోధక శక్తీ పెరుగుతుంది. నాన్‌ స్టిక్‌ పాత్రలకు ఉండే టెఫ్లాన్‌ కోటింగ్‌ కూరలతోబాటు శరీరంలో చేరి అనారోగ్యాలకు దారితీస్తుంది. అల్యూమినియం పాత్రలను ఎక్కువ వేడిచేస్తే రసాయనాలు పుట్టుకొస్తాయి. వీటిల్లో టొమేటో, నిమ్మ లాంటి సిట్రస్‌ పదార్థాలు ఉడికించినప్పుడు ఆమ్లకాలుగా మారి హాని చేస్తాయి. అనారోగ్యాలతోబాటు అల్జీమర్స్‌ కూడా వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. సర్జికల్‌ స్టీల్‌తో అలాంటి ఇబ్బందులు లేవు.

* ఈ పాత్రలు దీర్ఘకాలం మన్నుతాయి. ఆ తర్వాత కూడా నూరుశాతం రీసైక్లింగ్‌ చేయొచ్చు. కుక్‌ అండ్‌ సర్వ్‌ పాత్రలు కనుక వంట అయ్యాక వేరే డిషెస్‌లోకి మార్చనవసరం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్