రంగవల్లుల్ని గోడకి ఎక్కించేద్దాం

సంక్రాంతి అంటేనే ముగ్గుల పండగ. ప్రతి లోగిలీ రంగురంగుల ముగ్గులతో కళకళలాడుతుంది. ఈసారి వాటిని ముంగిటికే పరిమితం చేయకండి. గోడలకి ఎక్కించేయండి. ఎలాగంటారా? ఇలా..

Updated : 13 Jan 2022 06:34 IST

సంక్రాంతి అంటేనే ముగ్గుల పండగ. ప్రతి లోగిలీ రంగురంగుల ముగ్గులతో కళకళలాడుతుంది. ఈసారి వాటిని ముంగిటికే పరిమితం చేయకండి. గోడలకి ఎక్కించేయండి. ఎలాగంటారా? ఇలా..

* చతురస్ర లేదా దీర్ఘచతురస్రాకార వస్త్రాన్ని ఎంచుకోవాలి. ముదురు రంగు అయితే తెలుపు లేదా లేత వర్ణాలు, లేత రంగుదైతే ముదురు వర్ణాల పెయింట్‌తో ముగ్గు వేయాలి. ఆరాక ఫ్రేమ్‌గా గోడకు వేలాడేస్తే సరి. కొత్తగా అనిపిస్తుంది.
* కార్డ్‌బోర్డ్‌ లేదా దళసరి అట్టను గుండ్రంగా కత్తిరించుకోవాలి. ఒక్కోదానిపై ఒక్కో ముదురు రంగుని వేయాలి. తర్వాత తెల్ల రంగుతో ఒకే రకమైన ముగ్గును వేసి ఆరనివ్వాలి. వీటన్నింటినీ గోడపై వరుసగా అమర్చుకుంటే చాలు. గది రూపమే మారిపోతుంది. కింద వేలాడేలా గంటలను కడితే చూడముచ్చటగా ఉంటాయి.

* దళసరి కాగితాన్ని నాలుగు భాగాలుగా విభజించుకోవాలి. ఒక్కో రంగుతో వాటిని నింపాలి. ఆ తర్వాత నాలుగింటిలోనూ ఒకే రంగుతో రంగవల్లుల్ని తీర్చిదిద్ది చూడండి. ఎంత బాగుంటుందో! ఇంకా గదిలో టేబుల్‌ ఉంటే.. ఓ అట్టముక్కకి రంగుల కాగితాన్ని అంటించి దానికి ఓ మూల చిన్న ఇండోర్‌ ప్లాంట్‌ సర్దితే చాలు. ప్రత్యేకంగా ఉంటుంది.
* అడుగు పొడవు, వెడల్పున్న ప్లైవుడ్‌ను నలుపు రంగుతో నింపాలి. దానిపై తెలుపు రంగుతో ముగ్గు వేయాలి. ఇరువైపులా దీపపు దిమ్మెల డిజైన్‌ వేసి గోడకు వేలాడదీయండి. కింది భాగంలో చిన్న చిన్న గంటలను అమరిస్తే సరిపోతుంది. ఈ పండగకి ప్రయత్నించేసేయండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్