మీ పాన్ సరిగానే ఉందా!
నాన్‌స్టిక్ పాన్‌లు ఇల్లాలికి కాస్త పని తగ్గించాయి. వీటిలో పదార్థాలు అతుక్కోవు. కొద్ది నూనెతోనే వంట చేయొచ్చు. అయితే వీటిని అదేపనిగా వాడితే త్వరగా పాడైపోతాయి. అప్పుడు ఆరోగ్యానికీ
నాన్‌స్టిక్ పాన్‌లు ఇల్లాలికి కాస్త పని తగ్గించాయి. వీటిలో పదార్థాలు అతుక్కోవు. కొద్ది నూనెతోనే వంట చేయొచ్చు. అయితే వీటిని అదేపనిగా వాడితే త్వరగా పాడైపోతాయి. అప్పుడు ఆరోగ్యానికీ ముప్పే. కాబట్టి.. వీటిని గమనించుకోండి.
* తరచూ పాన్ వాడుతుంటే అది సహజ రంగును కోల్పోయి, నల్లగా మారుతుంది. అంటే.. పాడవుతోందనడానికి సంకేతం. ఈ సమయంలో దానిలో వండితే పాన్ కోటింగ్ ఆహారంతో కలిసిపోతుంది.
* పాన్‌లకి ప్రత్యేక గరిటెలు ఉంటాయి. చాలామంది స్టీలు వాటికే ప్రాధాన్యమిస్తారు. వీటితో ఆహారం తీసినప్పుడు గీతల్లా పడి ఎక్కువగా కనిపిస్తున్నా పనికి రాదనడానికి సూచికే. పాన్ పై పూతలో వాడే టెఫ్లాన్‌లో క్యాన్సర్ కారకం ఉంటుందట. గీతలు పడ్డప్పుడు ఆ రసాయనం ఆహారంతో కలిసిపోతుంది. ప్రమాదమేగా మరి!
* తరచూ ఎక్కువ వేడికి లోనై లోహం ఆకారం మారడం సర్వసాధారణం. అలా కనిపిస్తే దాన్ని తీసేయాల్సిన సమయం వచ్చిందని అర్థం. పాత్ర అడుగు ఎగుడు దిగుడుగా అయితే ఆహారం కూడా సరిగా ఉడకదు. అలాంటిదాన్ని తింటే జీర్ణసంబంధ సమస్యలొస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.