పరిమళాల... మొక్కలు!

ఇంట్లో అడుగుపెట్టగానే సహజ పరిమళాలు... అలసిన సొలసిన తనువు, మనసులకు హాయిని పంచి బడలికను తగ్గిస్తాయి. వీటికోసం రూమ్‌ ఫ్రెష్‌నర్‌లు అక్కర్లేదండి... ఈ చిట్టి మొక్కలను చక్కగా పెంచేయండి... పరిమళాలు ఆస్వాదించండి.

Published : 02 Mar 2022 01:03 IST

ఇంట్లో అడుగుపెట్టగానే సహజ పరిమళాలు... అలసిన సొలసిన తనువు, మనసులకు హాయిని పంచి బడలికను తగ్గిస్తాయి. వీటికోసం రూమ్‌ ఫ్రెష్‌నర్‌లు అక్కర్లేదండి... ఈ చిట్టి మొక్కలను చక్కగా పెంచేయండి... పరిమళాలు ఆస్వాదించండి.

మల్లె... సన్నజాజి, బొండు మల్లె... ఏదైనా ఇంటికి అందంతోపాటు పూలు పూసే కాలంలో పరిమళాలను మోసుకొస్తాయి. వీటిని సులభంగానూ పెంచేయొచ్చు. కాస్తంత వెలుతురు... సారవంతమైన మట్టి తొట్టె ఉంటే చాలు.
పుదీనా... దీని వాసన భలే ఉంటుంది. సహజ ఫ్రెష్‌నర్‌లా పనిచేస్తుంది. వంటగది కిటికీ దగ్గర పెంచి చూడండి. వంటకు, సువాసనలకూ... రెండు విధాలుగా ఉపయోగపడుతుంది.  సులువుగా పెరుగుతుంది.

లిల్లీ... శ్వేత కుసుమాలతో... సొగసైన కాడలతో.. ఆహ్లాదకరమైన పరిమళాలను వెదజల్లుతుందిది. అపార్ట్‌మెంట్‌, ఇండిపెండెంట్‌... ఇలా ఏ ఇంట్లో అయినా చక్కగా పెంచుకోవచ్చు. వెలుతురు పడే చోట ఇంట్లో మూలల్లో పెడితే అందం, సుగంధ పరిమళాలు రెండింటినీ ఆస్వాదించొచ్చు.  
రోస్‌మేరీ... మీ ఇంట్లో సహజ పరిమళాలు విరజిల్లాలంటే...రోస్‌మేరీ మొక్క పెంచుకుంటే సరి. దీని ఆకులు సూదుల్లా ఉంటాయి. అయితే  దీని సువాసనలు మాత్రం నిమ్మవాసనలను పోలి ఉంటాయి. ఈ మొక్కలు నర్సరీల్లోనే కాకుండా ఆన్‌లైన్‌లో సులువుగా దొరికేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్