ఇప్పుడిక.. సులువే!

భోజనాల బల్లో పొయ్యి గట్టో అయితే ఎడాపెడా రుద్దేసి శుభ్రం చేసేయొచ్చు. కానీ మైక్రోవేవ్‌ అలా కాదుగదా! కరెంటు సంబంధ వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి మరకలు, మచ్చలు

Updated : 20 Mar 2022 06:32 IST

భోజనాల బల్లో పొయ్యి గట్టో అయితే ఎడాపెడా రుద్దేసి శుభ్రం చేసేయొచ్చు. కానీ మైక్రోవేవ్‌ అలా కాదుగదా! కరెంటు సంబంధ వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి మరకలు, మచ్చలు పడినప్పుడు దాన్నెలా శుభ్రం చేసుకోవాలి అంటారా... అందుకోసం వచ్చిందే మైక్రోవేవ్‌ క్లీనర్‌. దీనిలో మార్క్‌ వరకు నీటిని తీసుకొని, కొద్దిగా వెనిగర్‌ను కలిపి మైక్రోవేవ్‌లో 5 నిమిషాల పాటు వేడిచేయండి. నీరు మరిగినప్పుడు దీనిపైన ఉన్న రంధ్రాల అమరిక నుంచి ఆవిరంతా ఒవెన్‌ అంతటా పరచుకుంటుంది. అది చల్లారాక స్పాంజ్‌ లేదా వస్త్రంతో తుడిచేస్తే సరిపోతుంది. జిడ్డు మాత్రమే కాదు.. దుర్వాసనా దూరమవుతుంది. వేడికి తట్టుకునేలా ఈ క్లీనర్‌ను తయారు చేశారు కాబట్టి, కరుగుతుందన్న భయం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్