ఇంట్లోనే మెరుగుపెడదామా..

పండగ వచ్చిందంటే బీరువాలో ఉన్న బంగారు నగలు బయటకు వస్తాయి. అమ్మవారికి అలంకరణగానూ వాడుతుంటాం. వేడుకలప్పుడు వేసుకొని తిరిగి హడావుడిగా భద్రపరుస్తుంటాం.

Updated : 17 Oct 2023 03:26 IST

పండగ వచ్చిందంటే బీరువాలో ఉన్న బంగారు నగలు బయటకు వస్తాయి. అమ్మవారికి అలంకరణగానూ వాడుతుంటాం. వేడుకలప్పుడు వేసుకొని తిరిగి హడావుడిగా భద్రపరుస్తుంటాం. దీంతో కొన్నిసార్లు నల్లగా మారతాయి. మెరిపించాలా.. ఈ చిట్కాలను ప్రయత్నించేయండి.

  • ఒక గిన్నె నిండుగా వేడి నీటిని తీసుకొని, కొన్ని చుక్కల డిష్‌వాష్‌ లిక్విడ్‌ లేదా చెంచా షాంపూ వేయాలి. ఆ మిశ్రమంలో నగలు వేసి కొద్దిసేపు నాననివ్వాలి. తర్వాత వాటిని మెత్తని బ్రష్‌తో తోమి, చల్లటి నీటిలో కడిగి, పొడి వస్త్రంతో తుడిస్తే సరి.
  • వేడి నీటిలో లిక్విడ్‌ డిటర్జెంట్‌, బేకింగ్‌సోడా అరచెంచా చొప్పున వేసి, బాగా కలపాలి. ఆ మిశ్రమంలో నగలను వేసి, అరగంట నాననివ్వాలి. ఆపై వాటిని రుద్ది కడిగినా కొత్తవాటిలా మెరుస్తాయి.
  • డిటర్జెంట్‌ పౌడర్‌, ఒక చెక్క నిమ్మరసం వేడి నీటిలో పిండాలి. దానిలో నల్లబడిన ఆభరణాలను వేసి ఐదు నిమిషాలుంచాలి. తర్వాత వాటిని టూత్‌పేస్టు రాసిన బ్రష్‌తో రుద్దినా ఫలితం కనిపిస్తుంది.
  • బంగారు గాజులైతే.. ముందు కొద్దిసేపు వేడినీటిలో నాననివ్వాలి. తర్వాత రెండు చెంచాల శనగపిండిలో తగినంత వెనిగర్‌ కలిపి, మెత్తని పేస్టులా చేయాలి. దీన్ని గాజులకు పట్టించి, కొంత సేపు పక్కన పెట్టాలి. తర్వాత టూత్‌పేస్టుతో రుద్ది, కడిగినా తిరిగి కొత్తవాటిలా మెరిసిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్