రూ.10తోనూ బంగారం కొనొచ్చు!!

పెళ్లి, వేడుకలు వచ్చాయంటే ముందు వచ్చే ఆలోచన ‘బంగారం కొనాల’నే కదూ! మధ్యతరగతి కుటుంబాలకు ఒక నగ కొనాలంటే డబ్బులు పోగేయడానికి నెలలు, ఏళ్లు పడుతుంది.

Published : 04 Mar 2024 01:49 IST

పెళ్లి, వేడుకలు వచ్చాయంటే ముందు వచ్చే ఆలోచన ‘బంగారం కొనాల’నే కదూ! మధ్యతరగతి కుటుంబాలకు ఒక నగ కొనాలంటే డబ్బులు పోగేయడానికి నెలలు, ఏళ్లు పడుతుంది. నిజానికి ధరించాలన్న ఆసక్తి కన్నా... మన ఆడాళ్లకు అదో భద్రతా మార్గం! అవసరాల్లో ఆదుకుంటుందని పెట్టుబడిగా పెట్టేవారే ఎక్కువ. కానీ బంగారం ధరేమో రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇంకెలా కొనగలం అనిపిస్తుంటుంది కదూ! అందుకే ఉన్న కొద్ది మొత్తంలోనే కొనుక్కునే వీలున్న ‘డిజిటల్‌’ మార్గాలెన్నో. వాటికైనా డబ్బులు కావాలిగా అంటారా? రూ.10తోనూ బంగారం కొనే వీలుంటే? దాన్ని నిజం చేసి చూపిస్తోంది ‘జార్‌’. గల్లగురుగు, ముంత కాన్సెప్టులో తెచ్చిందే ఇది. రోజువారీగా, ఒకేసారి డబ్బులున్నప్పుడు... వీలున్న పద్ధతిలో కొనుక్కోవచ్చు. ఖాతాలో ఎన్ని గ్రాముల బంగారం ఉందో ఎప్పటికప్పుడు చూపిస్తుంది. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి, మన వివరాలను ఇచ్చి, యూపీఐ లేదా బ్యాంకు ఖాతాకి ఆ అకౌంట్‌ని జత చేసుకుంటే సరిపోతుంది. డబ్బులు అవసరమైనప్పుడు అకౌంట్‌లో ఉన్న బంగారాన్ని బట్టి, ఆరోజు ధరకు అమ్ముకుంటే సరి. ఇదీ ఒకరకంగా ట్రేడింగే! కాకపోతే అతి తక్కువ మొత్తంతోనూ కొనుక్కునే వీలుండటమే ప్రత్యేకత. బాగుంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్