ఆరోగ్యానికి ఇంటి తోట

కొన్ని దశాబ్దాలుగా ఆహారం కోసం మాత్రమే పెంచే ఇంటి తోట, ఆధునిక కాలంలో అలంకరణప్రాయంగానూ మారింది. ఏదేమైనప్పటికీ చిన్నాపెద్దా అంతా తోటపనిలో పాలుపంచుకుంటున్నారు.

Published : 15 Mar 2024 01:38 IST

కొన్ని దశాబ్దాలుగా ఆహారం కోసం మాత్రమే పెంచే ఇంటి తోట, ఆధునిక కాలంలో అలంకరణప్రాయంగానూ మారింది. ఏదేమైనప్పటికీ చిన్నాపెద్దా అంతా తోటపనిలో పాలుపంచుకుంటున్నారు. గార్డెనింగ్‌తో శారీరక ప్రయోజనాలతో పాటు, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని అధ్యయనాలూ చెబుతున్నాయి.

  • మొక్కల చుట్టూ తిరుగుతూ పని చేయడం వల్ల మనకు తెలియకుండానే శరీరానికి చిన్నపాటి వ్యాయామం అయిపోతుంది. మట్టి తవ్వినప్పుడూ, వంగినపుడూ, మల్చ్‌ చేసేటప్పుడు, తేలికపాటి బరువు ఎత్తడం వంటివి అన్నీ మన శరీరానికి ఎంతో మేలుచేస్తాయి.
  • ఇంటి తోటలో సమయం గడపడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఎక్కడైనా వాపులు ఉంటే తగ్గుతాయి కూడా... స్వచ్ఛమైన గాలి పెరగడం వల్ల  రోగనిరోధక శక్తి పెరుగుతుందని ‘నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ మెడిసన్‌’ పేర్కొంటోంది. తోటపనివల్ల విటమిన్‌-డి శాతం పెరుగుతుంది. జీవక్రియ కూడా మెరుగవుతుంది. నాడీవ్యవస్థ బలంగా మారుతుంది. ఇది పిల్లల్లో ఎముకల అభివృద్ధికీ, పెద్దవారిలో ఎముకలను బలోపేతం చేయడంలోనూ తోడ్పడుతుంది. అంతేనా ఆరు బయట, బాల్కనీ, పోర్టికోల్లో తోటను పెంచేవారిలో సూర్యకాంతి కారణంగా మెలటోనిన్‌ ఉత్పత్తవుతుందట. తద్వారా సెరటోనిన్‌ ఉత్పత్తి పెరిగి నిద్రకు దోహదపడుతుంది.
  • ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌ (పీయన్‌ఏయస్‌) ప్రకారం తోటమట్టి నుంచి వచ్చే పరిమళాలకు కూడా కొన్ని దీర్ఘకాలిక రోగాలను నియంత్రణ చేయగల శక్తి ఉందట. పెద్దపేగు క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచుతుంది. తోటమట్టిలో ఉండే మంచి బ్యాక్టీరియా ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది.
  • రోజుకి కనీసం 20 నిమిషాలు తోటపని చేసిన వారి మెదడులో... న్యూరోట్రాఫిక్‌ ఫ్యాక్టర్స్‌ (బీడీయన్‌యఫ్‌), ప్లేట్‌లెట్‌ డిరైవ్డ్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్స్‌ (పీడిజీయఫ్‌) స్థాయులు గణనీయంగా పెరిగాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా రక్తనాళాల పెరుగుదలనూ, న్యూరాన్ల అభివృద్ధినీ ప్రోత్సహిస్తాయి. జ్ఞాపకశక్తీ పెరుగుతుందని మరికొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
  • అమెరికా వంటి దేశాలు సైతం ఆహార ద్రవ్యోల్బణంతో ప్రతి వస్తువు ధరలు ఆకాశాన్ని తాకడంతో లాక్‌డౌన్‌ సమయంలో కూరగాయలనూ, పండ్లనూ పెంచడం ప్రారంభించారు. క్యారెట్‌, టొమాటో, స్ట్రాబెర్రీలు, బీన్స్‌ మొదలైనవి ఇంటి ఆవరణలోనూ, టబ్‌ల్లోనే పెంచుకోవచ్చు. లేదంటే ఆరుబయట ప్రదేశాన్ని ఇంటి తోటగా మార్చేయవచ్చు. మొక్కలను మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం వల్ల అనేక అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరూ మొదలుపెట్టండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్