నిండైన నీల లత అందం!

నీలం, ఊదా, తెలుపు రంగుల్లో విరబూసే పెద్ద పెద్ద పూలు, లేత ముదురాకుపచ్చ ఆకులతో అల్లుకుపోయే బెంగాల్‌ క్లాక్‌ వైన్‌ ఏ ఇంట పెంచినా.... ప్రకృతి అందాలు పరుచుకున్నట్లే అనిపిస్తాయి. ఇవి వెదజల్లే పరిమళాలు పరిసరాలనూ ఆహ్లాదపరుస్తాయి.

Updated : 18 Apr 2024 16:59 IST

నీలం, ఊదా, తెలుపు రంగుల్లో విరబూసే పెద్ద పెద్ద పూలు, లేత ముదురాకుపచ్చ ఆకులతో అల్లుకుపోయే బెంగాల్‌ క్లాక్‌ వైన్‌ ఏ ఇంట పెంచినా.... ప్రకృతి అందాలు పరుచుకున్నట్లే అనిపిస్తాయి. ఇవి వెదజల్లే పరిమళాలు పరిసరాలనూ ఆహ్లాదపరుస్తాయి.

బెంగాల్‌ క్లాక్‌ వైన్‌ని ప్రపంచంలోనే ‘అత్యంత అందమైన తీగ’ అని పిలుస్తారు. వీటి పూలు మార్నింగ్‌ గ్లోరీ ఫ్లవర్స్‌ని పోలి ఉంటాయి. గోడలూ, పర్గోలాలూ, పోర్టికోలు, బాల్కనీ గ్రిల్స్‌... అల్లుకునేందుకు ఆధారం ఇవ్వాలే కానీ, గడియారం ముల్లు తిరిగినట్లే చక్కగా చుట్టేస్తుందీ తీగ. అందుకే దీనికి బెంగాల్‌ క్లాక్‌ వైన్‌ అనే పేరొచ్చింది. బెంగాల్‌ ట్రంపెట్‌, స్కైవైన్‌, నీల్‌ లతా... అంటూ మరెన్నో రకాలుగానూ పిలుస్తారు.

శాస్త్రీయంగా దీన్ని థన్‌బెర్గియా గ్రాండీ ఫ్లోరా అని పిలుస్తారు. స్వీడిష్‌ శాస్త్రవేత్త కార్ల్‌ పీటర్‌ థన్‌బెర్గియా గౌరవార్థం దీనికా పేరు పెట్టారట. అకాంతసీ కుటుంబానికి చెందిన గుబురు పొద లేదా తీగ ఇది. అగస్టా, ఆల్బా అనే రకాలు దీనిలో ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. ఈ బెంగాల్‌ క్లాక్‌ వైన్‌ పుట్టింది భారత్‌లో అయినా... ఆసియా దేశాలన్నింటా కనిపిస్తుంది. ఈ తీగకు ఔషధ గుణాలు ఎక్కువని చెబుతోంది ఆయుర్వేదం. సుమారు ఇరవై అడుగుల ఎత్తువరకూ పెరిగే దీన్ని నేలలో పెంచుకోవడం అనువు. అలాకాకుండా కుండీల్లోనే పెంచాలంటే పెద్ద పరిమాణంలో ఉన్నదాన్ని ఎంచుకోవాలి. దీన్ని నాటేందుకు సారవంతమైన మట్టి తయారు చేసుకోవాలి. కుళ్లిన పేడ, ఎన్‌పీకే సమగ్ర ఎరువుని నెలకోసారి అందిస్తే పూలు నిండుగా పూస్తాయి. నీళ్లు మరీ ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు. తడి నిలవకుండా చూసుకుంటే చాలు.

ఏడాదంతా పూస్తాయి...

ట్రంపెట్‌ వాద్యాన్ని గుర్తు తెచ్చేలా వీటి పూల ఆకృతి ఉంటుంది. మూడు అంగుళాల వెడల్పుతో లోపలివైపు లేత పసుపుని అద్దుకుని ఊదా, నీలం, తెలుపు వర్ణాల్లో విరుస్తాయివి. మంచి సువాసననూ ఇస్తాయి. ఏడాదంతా పూస్తాయి. నలభై ఐదు డిగ్రీల వరకూ ఎండను తట్టుకోగలవు. అంతేకాదు, వీటి కాయలు బాగా ఎండిపోయాక విచ్చుకున్నప్పుడు కొన్నిమీటర్ల దూరం వరకూ విత్తనాలు ఎగిరి పడతాయి. దీంతో అక్కడ కొత్త మొక్కలు విస్తరిస్తాయి. కొమ్మ రూపంలోనూ మొక్క నాటుకోవచ్చు. దీనికి చీడపీడల సమస్యలూ తక్కువే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్