చదువుతోపాటు ... ఉద్యోగం చేయండి!

కొవిడ్‌ కారణంగా దాదాపు రెండేళ్లు వృథాగా గడిచిపోయాయి. మరీ ముఖ్యంగా టీనేజర్స్‌కి. వాళ్ల చదువులకి అంతరాయం ఏర్పడింది. ఆన్‌లైన్‌ పాఠాలతో  కొంతమేర లోటు పూడ్చుకున్నా. నైపుణ్యాల్లో మాత్రం వెనకబడ్డారు. చదువుతూనే పార్ట్‌ టైమ్‌ జాబ్‌లు

Published : 23 Jun 2022 02:11 IST

కొవిడ్‌ కారణంగా దాదాపు రెండేళ్లు వృథాగా గడిచిపోయాయి. మరీ ముఖ్యంగా టీనేజర్స్‌కి. వాళ్ల చదువులకి అంతరాయం ఏర్పడింది. ఆన్‌లైన్‌ పాఠాలతో  కొంతమేర లోటు పూడ్చుకున్నా. నైపుణ్యాల్లో మాత్రం వెనకబడ్డారు. చదువుతూనే పార్ట్‌ టైమ్‌ జాబ్‌లు చేస్తే ఈ విషయంలో మెరుగుపడొచ్చంటున్నారు నిపుణులు.

* ఇప్పుడిప్పుడే ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. సాధారణ ఉద్యోగాల నుంచి ప్రాముఖ్యమున్నవీ పార్ట్‌టైమ్‌గా దొరుకుతాయి. కాబట్టి ఏదైనా సంస్థలో చేరండి. దీనివల్ల సంపాదన, ఖర్చు లాంటి ఆర్థిక పాఠాలు తెలుస్తాయి.

* రెస్టరెంట్‌, ఎన్జీఓ, రిటైల్‌ దుకాణం... ఎందులో పార్ట్‌టైమ్‌ ఉద్యోగానికి కుదురుకున్నా మీదైన ప్రపంచంతోనే కాకుండా బయటవాళ్లతో మాట్లాడే అవకాశం వస్తుంది. దానివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

* సోషల్‌ మీడియాకి బానిసలైపోయిన వాళ్లెందరో. ఆఫ్‌లైన్లో జరిగే పనిలో కుదురుకుంటే దాన్నుంచి కొన్ని గంటలైనా బయట పడొచ్చు.

* సహోద్యోగులతో మాట్లాడటం, పరిచయాలు ఏర్పరచుకోవడం, వాస్తవ ప్రపంచంలో భిన్నమైన వ్యక్తుల్ని కలవడం.. ఈ అనుభవం ద్వారా ఈ నైపుణ్యాల్ని తెలుసుకోవచ్చు.

* ఫోన్లో మాట్లాడటం, చాటింగ్‌ ఎక్కువైపోయాయి. పనిలో నిమగ్నమైతే ఆ లోకాభిరామాయణం ఆగిపోతుంది. ఏదైనా పనిని పూర్తిచేసిన ప్రతి సారీ నేర్చుకున్నాననే ఆత్మవిశ్వాసం వస్తుంది. నేనూ సాధించగలనన్న నమ్మకం కుదురుతుంది.

* అంతేకాదు, సమయ పాలన తెలుస్తుంది. స్వతంత్రత వస్తుంది. క్లాస్‌రూమ్‌ బయట స్నేహితులు ఏర్పడతారు. కొత్త అవకాశాలు తెలుస్తాయి. అదే సమయంలో చదువుకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్