అలా తరచూ అవుతోందా?

ఆఖరి నిమిషంలో హడావుడి పడొద్దని ఇక్కడే పెట్టానే! నిన్న కూడా గుర్తు చేసుకున్నా.. ఇప్పుడే ఎంత ప్రయత్నించినా జ్ఞప్తికి రావట్లేదు. ఇంతలోనే ఎలా మర్చిపోయానబ్బా.. ఇలా తరచూ అనుకుంటున్నారా? నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు నిపుణులు.

Published : 06 Apr 2023 00:19 IST

ఆఖరి నిమిషంలో హడావుడి పడొద్దని ఇక్కడే పెట్టానే! నిన్న కూడా గుర్తు చేసుకున్నా.. ఇప్పుడే ఎంత ప్రయత్నించినా జ్ఞప్తికి రావట్లేదు. ఇంతలోనే ఎలా మర్చిపోయానబ్బా.. ఇలా తరచూ అనుకుంటున్నారా? నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు నిపుణులు.

* పుట్టగొడుగుల్లో ఉండే కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంతోపాటు అల్జీమర్స్‌ రాకుండానూ కాపాడతాయి. వీటితోపాటు డార్క్‌ చాక్లెట్‌, దాల్చిన చెక్క, తాజా కూరగాయలకు రోజువారీ ఆహారంలో ప్రాధాన్యమివ్వండి. మతి మరుపును దూరంగా ఉంచొచ్చు.

* ఇంట్లో, ఆఫీసులో సంబంధ బాంధవ్యాలు బాగానే ఉన్నాయా? మరచి పోవడానికీ, దీనికీ ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఇతరులతో సత్సంబంధాలు నెరపకపోవడం, గొడవలు, చిరాకులు వంటివీ మెదడుపై ప్రభావం చూపుతాయట. ఫలితమే మరచిపోవడం లాంటివి. కాబట్టి, స్నేహాలు, బాంధవ్యాలపై దృష్టిపెట్టేయండి.

* ఇంట్లో ఉంటే వంట గది, ఆఫీసుకెళితే సిస్టమ్‌! ఇవీ మెదడుపై ప్రతికూల ప్రభావం చూపేవే! బాల్కనీలో కూర్చోవడం, మొక్కల మధ్య నడవడం.. ఆఫీసులో అయితే కొద్దిసేపు కారిడార్లో నడక వంటివి చేయండి. అన్నట్టు సరైన నిద్ర ఉండేలా చూసుకోవడమూ తప్పనిసరే!

* మీ ప్రధాన వ్యాపకమేంటి ఫోనేనా? వీలైనంత పక్కన పెట్టేయండి. దీన్నుంచి వచ్చే నీలికాంతి మెదడుపై ప్రతికూల ప్రభావం చూపి మతిమరుపునకు దారి తీస్తుంది. పుస్తకాలు చదవడం, గత విషయాలను గుర్తుతెచ్చుకొని రాయడం, పజిల్స్‌ వంటివాటిపై దృష్టిపెట్టండి. ఏమాత్రం సమయం దొరికినా వెనక్కి నడవడం సాధన చేయండి. ఇవన్నీ సమస్యను తగ్గించేస్తాయి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని