‘జయ’లా ధైర్యం చేయమంటోంది!

అమ్మాయిని అత్తారింటికి పంపుతూ అంతా ఏడుస్తుంటారు. అది చూసి జయభారతి కంట్లో కన్నీరు ఉప్పొంగదు. కారణం... ఇష్టం లేని పెళ్లిని చేసి, బలవంతంగా అత్తారింటికి పంపుతూ ఏడుస్తోంటే అలా కాక ఆ అమ్మాయికి మరెలా అనిపిస్తుంది? పుట్టి పెరిగిన ఇంట్లో నచ్చింది చదవడానికి లేదు, కోరుకున్న వ్యక్తిని చేసుకోవడానికి లేదు.

Updated : 08 Mar 2024 12:15 IST

మ్మాయిని అత్తారింటికి పంపుతూ అంతా ఏడుస్తుంటారు. అది చూసి జయభారతి కంట్లో కన్నీరు ఉప్పొంగదు. కారణం... ఇష్టం లేని పెళ్లిని చేసి, బలవంతంగా అత్తారింటికి పంపుతూ ఏడుస్తోంటే అలా కాక ఆ అమ్మాయికి మరెలా అనిపిస్తుంది? పుట్టి పెరిగిన ఇంట్లో నచ్చింది చదవడానికి లేదు, కోరుకున్న వ్యక్తిని చేసుకోవడానికి లేదు. పోనీ ‘నా ఇష్టమిద’ని చెప్పేలోగా చెంప మీద దెబ్బ పడిపోతుంది. తన వాళ్లతోనే జీవితం ఇలా ఉంటే... కొత్త వ్యక్తితో జీవితం పంచుకోవాలంటే భయమేయదూ? అయినా మనసు కుదుటపరచుకుని, కొత్త జీవితంలో ఇమిడి పోవాలనుకుంటుంది. ఇక్కడైనా తన అభిప్రాయానికి విలువ ఉంటుందని ఆశించేంతలో... చెంప మీద చెళ్లుమని ఓ దెబ్బ. కన్నవాళ్లకు చెబితే ‘చిన్న విషయానికి ఎందుకింత హంగామా చేస్తున్నావ’న్న మందలింపు. పైగా ఆడవాళ్లంటే అణకువగా ఉండటం, కమ్మగా వంట చేసిపెట్టడం, సంస్కారవంతంగా ఉంటే చాలన్న అభిప్రాయం... వీటన్నింటినీ ప్రశ్నిస్తూ వచ్చిందే ‘జయ జయ జయ జయ హే’ సినిమా. అయితే ఇక్కడ జయ ‘నా తలరాత ఇంతే’ అని ఊరుకోదు. ప్రతిఘటిస్తుంది కూడా. అప్పటిదాకా ఆమెకు అండగా రానివాళ్లంతా భర్త మీద చేయి చేసుకోగానే తప్పంటూ ప్రశ్నించడం మొదలుపెడతారు. అయినా ఆమె తొణకదు. ఆ బంధం నుంచి ధైర్యంగా బయటికొచ్చి, తన కాళ్లపై తాను నిలబడుతుంది. సగటు ఆడపిల్ల ఎదుర్కొనే పరిస్థితులను కళ్లకు కట్టించే ‘జయభారతి’ పాత్రలో మలయాళ నటి దర్శన రాజేంద్రన్‌ నటించారు. ‘సర్దుకుపోవడం’ పేరుతో మహిళలు ఎదుర్కొంటున్న ‘గృహహింస’కు చిహ్నాలే ఇవి. చిన్న చెంప దెబ్బ అంటూ సహిస్తూ ఉండక... అవసరమైతే సివంగిలా మారి ఎదిరించమన్న సలహానిస్తోందీ సినిమా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్