అమ్మ కాబోతున్నప్పుడు...

గర్భధారణ సమయంలో మహిళలు మానసికంగానూ పలురకాల ఆందోళనలకు గురవుతారు. ప్రసవ సమయం దగ్గరపడే కొద్దీ కలిగే ఒత్తిడి, భావోద్వేగాలూ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయంటున్నారు వైద్య నిపుణులు. వీటిని అధిగమించాలంటే ఆరోగ్యకర అలవాట్లు, జీవనశైలిలో మార్పులు అవసరమని సూచిస్తున్నారు

Updated : 16 Feb 2022 02:49 IST

గర్భధారణ సమయంలో మహిళలు మానసికంగానూ పలురకాల ఆందోళనలకు గురవుతారు. ప్రసవ సమయం దగ్గరపడే కొద్దీ కలిగే ఒత్తిడి, భావోద్వేగాలూ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయంటున్నారు వైద్య నిపుణులు. వీటిని అధిగమించాలంటే ఆరోగ్యకర అలవాట్లు, జీవనశైలిలో మార్పులు అవసరమని సూచిస్తున్నారు. ముఖ్యంగా 3, 5, 8 గుర్తుపెట్టుకోండి.

ఒమేగా 3 మెదడుకు... ఆహారంలో చేపలు, ఫ్లాక్స్‌ సీడ్స్‌, అవకాడో, గింజధాన్యాలు, విత్తనాలకు ప్రాముఖ్యతనిస్తే, వీటిద్వారా ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్‌, ఆరోగ్యకరమైన కొవ్వు మెదడును నిత్యం ఉత్సాహంగా ఉంచుతాయి. ఒత్తిడి, ఆందోళన వంటివి దరి చేరనివ్వవు.  
5 స్నాక్స్‌... రోజులో అయిదుసార్లుగా ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ప్రతి రెండు గంటలకోసారి స్నాక్స్‌ తినడం మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను సమన్వయం చేస్తుంది. ఉడికించిన గింజలు, పచ్చి కాయ గూరలు, పండ్లు వంటి పౌష్టిక విలువలున్న వాటినే ఎంచుకోవాలి. ద్రవ పదార్థాలకు పెద్దపీట వేయాలి. తాజా పండ్ల రసాలు, నీళ్లు వంటివి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.  
8 నిద్రతో.. రోజుకి కనీసం ఎనిమిది గంటల నిద్ర అత్యంత ముఖ్యం. దీంతో అలసట, ఒత్తిడి ఉండవు. నిద్ర పట్టలేదూ మనసుకు నచ్చిన సంగీతాన్ని వినండి. భోజనం తర్వాత పావుగంట సేపు నడిస్తే నిద్ర తేలికగా వస్తుంది. యోగా లేదా ధ్యానం అలవాటు చేసుకోవాలి. నిద్రలేమి మూడ్‌ స్వింగ్స్‌కు కారణమవుతుంది. ఇది మనసుపై ఒత్తిడి కలిగించి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు, ఎక్కువగా ఆకలి అనిపించి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా బరువు పెరిగే ప్రమాదం ఉంది. వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్