నలుగురిలోకి వెళ్లలేను...

డిగ్రీ చదువుతున్నాను. తెల్లగా, అందంగా ఉంటాను. కానీ చాలా బిడియస్తురాలిని. ఎవరైనా నన్ను గమనిస్తుంటే.. చాలా ఆందోళనగా ఉంటుంది. అబ్బాయిలతో మాట్లాడాలంటే అసలే భయం. నా ప్రవర్తన చూసి స్నేహితులంతా నవ్వుతున్నారు. నేను మారడం ఎలా? మీరు శారీరకంగా బాగున్నారు. తెలివితేటలున్నాయి కనుక డిగ్రీ వరకూ వచ్చారు.

Updated : 25 Sep 2023 12:25 IST

డిగ్రీ చదువుతున్నాను. తెల్లగా, అందంగా ఉంటాను. కానీ చాలా బిడియస్తురాలిని. ఎవరైనా నన్ను గమనిస్తుంటే.. చాలా ఆందోళనగా ఉంటుంది. అబ్బాయిలతో మాట్లాడాలంటే అసలే భయం. నా ప్రవర్తన చూసి స్నేహితులంతా నవ్వుతున్నారు. నేను మారడం ఎలా?

ఓ సోదరి

మీరు శారీరకంగా బాగున్నారు. తెలివితేటలున్నాయి కనుక డిగ్రీ వరకూ వచ్చారు. కానీ ఉద్వేగపరంగా కొంచెం పరిపక్వత లోపించింది. అందంగా ఉన్నప్పటికీ కలవలేకపోతున్నారంటే.. మనసులో ఏదైనా న్యూనతాభావం ఉందేమో! మన మీద మనకు నమ్మకం లేకుంటే.. ఇతరుల ముందు ఎలా ప్రవర్తిస్తామో, ఎవరైనా గమనిస్తున్నారేమో, తక్కువగా అంచనా వేస్తారేమో, ఏమంటారోలాంటి ఆలోచనలతో భయం, దిగులు కలుగుతాయి. అందుకే కలవలేకపోతున్నారు. దీన్ని ‘సోషల్‌ యాంగ్జయిటీ డిజార్డర్‌’ అంటారు. దీనివల్ల నలుగురిలోకి వెళ్లాల్సిన సందర్భాలను తప్పించుకోవాలని చూస్తారు. పరిచయం లేనివారిని ఎదుర్కోలేరు. ఈ డిజార్డర్‌ వంశపారంపర్యంగా వచ్చే అవకాశమూ ఉంది. సైకియాట్రిస్టును సంప్రదిస్తే.. అసలు మీ స్వభావమే అలాంటిదా? జెనెటిక్‌గా వచ్చిందా? మిమ్మల్ని పెంచిన రీతి వల్ల ఇలా ఉందా? ఏదైనా అవమానం జరిగిందా? ఆ అనుభవంతో ఇలా అయ్యారా అంటూ అన్ని కోణాల్లో పరిశీలిస్తారు. మీ మనస్తత్వం.. పెంపకం.. పరిసరాలు, పరిస్థితులు.. మీ అనుభవాలు.. ఎనలైజ్‌ చేసి మార్పు వచ్చేందుకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. అవసరమైతే ఆందోళన తగ్గించేందుకు మందులు కూడా ఉన్నాయి. భయపడే పరిస్థితులకు మిమ్మల్ని ఎక్స్‌పోజ్‌ చేసి.. ఆందోళనను ఎదుర్కోవడం నేర్పిస్తారు. దీన్ని ‘సిస్టమాటిక్‌ డీ సెన్సిటైజేషన్‌’ అంటారు. దాంతోబాటు ‘సోషల్‌ స్కిల్స్‌ ట్రెయినింగ్‌’, ‘సోషల్‌ బిహేవియర్‌ థెరపీ’లతో నలుగురిలో మెలిగే నైపుణ్యాలను నేర్పిస్తారు. తప్పనిసరిగా సైకియాట్రిస్టును సంప్రదించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్